బాలకృష్ణను కలుసుకున్న పవన్ కళ్యాణ్.. ఫొటో వైరల్.. ఎందుకు కలిశారంటే?
నందమూరి బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ లో ఒక తెలియని ఉత్సాహం కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఇదివరకే కొన్నిసార్లు వీరు కలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం పెద్దగా బయటకు రాలేదు. అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సెట్లో కనిపించడం వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఇక ఆయన ఎందుకు కలిశారు అనే వివరాల్లోకి వెళితే.

బాలయ్య షోలో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా హరిహర వీలమల్లు సినిమా షూటింగ్లో పాల్గొంటూనే మరొకవైపు తన రాజకీయ కార్యక్రమాలలో కూడా రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. ఆయన ప్రజాసేవకు మాత్రం కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా ముందుకు సాగుతున్నారు. అయితే మొదటిసారి పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో కనిపించబోతున్నట్లు ఇటీవల ఒక టాక్ వినిపించిన విషయం తెలిసిందే.

అంతకంటే ముందే..
నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో కలుసుకున్నారు. కానీ వారికి సంబంధించిన ఫోటోలు మాత్రం పెద్దగా బయటకు రాలేదు. అయితే ఇప్పుడు అన్ స్టాపబుల్ షో లో వీరు కలుసుకోబోతున్నారు అనగానే ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి కలిగింది. అయితే అంతకంటే ముందుగా ఇద్దరు ఒక దగ్గరకు కలుసుకొని మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

పవన్, బాలకృష్ణ కలయిక
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన సినిమా సెట్ లో ఉండగా హఠాత్తుగా అక్కడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులలో పెద్దగా ఎవరికి తెలియదట. ఇక ఆయన రాగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నందమూరి బాలయ్య బాబును కలుసుకొని అలాగే చిత్ర యూనిట్ సభ్యులకు కూడా అభివాదాలు తెలిపారు.

ఫొటో వైరల్
ప్రస్తుతం సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కలుసుకున్న ఒక ఫోటో అయితే వైరల్ గా మారిపోయింది. అందులో పవన్ కళ్యాణ్ వైట్ డ్రెస్ లో రెగ్యులర్ ఫార్మాట్లోనే కనిపించాడు. ఇక బాలయ్య బాబు మాత్రం ఒక స్పెషల్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్ లో కనిపించారు. ఇక పవన్ కళ్యాణ్ రాగానే ప్రత్యేకంగా బాలయ్య బాబు ఆహ్వానిస్తూ చిత్ర యూనిట్ సభ్యులను కూడా ఆయనకు పరిచయం చేశారు.

ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడు?
అయితే ఇంత హఠాత్తుగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఎందుకు కలుసుకున్నారు అనే విషయంలో అయితే చాలా రకాల రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా అయితే పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షోకు సంబంధించిన విషయం గురించి మాట్లాడడానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. డిసెంబర్ 27వ తేదీన వీరి ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ నిర్వహించే అవకాశం ఉందట. ఇక షో మాత్రం టెలికాస్ట్ అయ్యేది 2023 సంక్రాంతికి లేదా జనవరి 26వ తేదీన ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











