twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable 2: రష్మికపై మోజుపడ్డ బాలయ్య.. కియారా అద్వానీతో షూటింగ్ లేకున్నా కూడా..

    |

    సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసే నందమూరి బాలయ్య బాబు టాక్ షోతో కూడా అదరగొడుతున్నాడు. తన దైన మాటతీరు, హావా భావాలతో యంగ్ హీరోలకు సైతం దీటుగా చలాకీగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అన్‌స్టాపబుల్ 2 సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ తో రికార్డు క్రియేట్ చేసిన బాలయ్య బాబు తాజాగా రెండో ఎపిసోడ్ ప్రోమోతో వచ్చాడు. ఈ ఎపిసోడ్ కి మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డీజే టిల్లుగాడు సిద్ధు జొన్నల గడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీళ్లిద్దరికి కౌంటర్లు వేస్తూ ఆట ఆడిస్తూ సూపర్ ఎంటర్టైన్ చేశాడు నందమూరి నట సింహం. ఈ ఎపిసోడ్ ప్రోమోలో రష్మిక మందన్నా, తదితర హీరోయిన్ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    మనసు దోచుకున్న ఇద్దరు హీరోలు..

    మనసు దోచుకున్న ఇద్దరు హీరోలు..

    అన్‌స్టాపబుల్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ఇచ్చిన ఉత్సాహంతో రెండో ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేసింది ఆహా. అన్‌స్టాపబుల్2 రెండో ఎపిసోడ్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ సందడి చేశారు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో తన మనసు దోచుకున్న ఇద్దరు హీరోలను పిలుస్తున్నానంటూ విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డను పిలిచాడు బాలకృష్ణ. వచ్చి రాగానే.. ఎవరయ్యా సిద్ధు బాబు హెయిర సరిగ్గా దువ్వలేదు అని బాలకృష్ణ అంటే.. సర్.. ఇది మెస్సీ లుక్ సర్ అని సిద్ధు జొన్నల గడ్డ అంటాడు.

    నా సినిమాలన్ని మెస్ అయ్యాయి..

    నా సినిమాలన్ని మెస్ అయ్యాయి..

    దీంతో.. ఆ.. అలా మెస్సీ లుక్ లో తో చేసిన నా సినిమాలన్ని మెస్ అయ్యాయి అని బాలకృష్ణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తోంది. అప్పుడప్పుడు కలుస్తుంటారా మీరిద్దరు అని బాలకృష్ణ అడిగితే.. నిన్న గాక మొన్ననే అని విశ్వక్ సేన్ చెబుతాడు. అప్పుడు మరి ఎన్ని పెగ్గులు అయ్యాయని బాలకృష్ణ అనడంతో షోలో నవ్వులు విరబూసాయి. ఒకరేమో మాస్ కా దాస్, మరొకరేమే మాస్ కా బాస్.. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా.. గాడ్ ఆఫ్ మాస్ అని చెప్పాడు బాలకృష్ణ.

    ఫ్లర్టింగ్ కు టిప్స్ ఇవ్వండి..

    ఫ్లర్టింగ్ కు టిప్స్ ఇవ్వండి..

    ఇప్పుడు వీన్ని పార్టీకి పిలిస్తే తెల్లారేదాక వదలడు అని ఏ హీరోని అనుకుంటారు అని బాలయ్య అడిగిన ప్రశ్నకు విశ్వక్ సేన్ వైపు చేయి చూపిస్తాడు సిద్ధు జొన్నల గడ్డ. తర్వాత ఫ్లర్టింగ్ కు టిప్స్ ఇవ్వండమ్మా అని అడిగితే చిన్నగా ఫస్ట్ పొగడాలి, తర్వాత నీ హెయిర్ ఏదో కొంచెం ఆఫ్ ఉంది ఇవాళ.. రైట్ సైడ్ సరిగా దువ్వు కోలేదంటూ అని సిద్ధూ అంటే అలా అని నువ్వే దువ్వుతవా అని విశ్వక్ కౌంటర్ వేశాడు.

    రొమాంటిక్ సీన్ ఉంటే చాలు..

    రొమాంటిక్ సీన్ ఉంటే చాలు..

    తర్వాత ముగ్గురు కలిసి ఏదో గేమ్ ఆడినట్లు ఉన్నారు. ఈ గేమ్ లో భాగంగా మీకు ప్రజెంట్ క్రష్ ఎవరు సార్ అని బాలకృష్ణని అడిగితే ఆయన.. రష్మిక మందన్నా అని సమాధానం ఇచ్చాడు. అనంతరం ఈ హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ ఉంటే చాలు అని ఎవరితో అనుకుంటావ్ అని బాలయ్య అడిగిన ప్రశ్నకు.. కియారా అద్వానీ అంటే నాకు ఇప్పుడు క్రష్ ఉంది సార్ అని సిద్ధు సమాధానం ఇస్తాడు.

    షూటింగ్ లేకున్నా పర్వాలేదు..

    ఈ ఆన్సర్ తో షూటింగ్ లేకున్నా పర్వాలేదు అని బాలకృష్ణ అంటాడు. దీంతో సిద్ధూ, విశ్వక్ సేన్ స్టేజ్ పై తెగ నవ్వేస్తారు. తర్వాత వాళ్లిద్దరిచేత పలు గేమ్స్ ఆడిపించాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇందాకా నేను వేసినప్పుడు చిరగలేదని బాధపడ్డాను సార్.. ఇప్పుడు ఇతనికి చిరిగింది సార్.. అంటూ సిద్ధు నవ్వించాడు. ఇలా మరిన్ని ఆసక్తికర విశేషాలతో ఆద్యంతం చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది అన్‌స్టాపబుల్ 2 సీజన్ సెకండ్ ఎపిసోడ్. ప్రోమో చూస్తుంటే ఫుల్ ఎపిసోడ్ కూడా ఆద్యంతం సూపర్ ఎంటర్టైనింగ్ గా ఫస్ట్ ఎపిసోడ్ కు మించి ట్రెండ్ క్రియేట్ చేస్తుందనిపిస్తుంది.

    English summary
    Vishwak Sen And Sidhu Jonnalagadda In Unstoppable 2 Show. Nandamuri Balakrishna Says His Crush Is Rashmika Mandanna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X