Unstoppable 4: కార్తీతో గొడవలపై ప్రశ్నించిన బాలయ్య.. అన్‌స్టాపబుల్‌లో తలపట్టుకొన్న సూర్య
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable With NBK) సీజన్ 4 రేటింగ్ పరంగా దూసుకెళ్తున్నది. ఇప్పటికే మూడు సీజన్లు బ్లాక్ బస్టర్ కావడంతో నాలుగో సీజన్‌పై భారీ అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగినట్టే తాజా సీజన్ కంటెంట్‌తో గెస్టులతో క్రేజీగా మారింది. తాజాగా ఈ టాప్ రేటింగ్ షోలోకి కంగువా టీమ్ వచ్చింది. సూర్యపై బాలకృష్ణ ఎక్కువ పెట్టిన ప్రశ్నలు..వాటికి వచ్చిన సమాధానాలు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..
అన్‌స్టాపబుల్ 4 మొదలైనప్పటి నుంచి టాక్ షో పాపులర్‌గా మారిపోయింది. ఈ షో ఇండియాలోనే నంబర్ వన్ షోగా మారింది. బాలకృష్ణ హోస్టింగ్ ఆయన ఇమేజ్‌ను మార్చడమే కాకుండా అతడిపై థింకింగ్ మారేలా చేసింది. అలాంటి పాపులారిటీతో ఈ సీజన్ 4 గ్రాండ్‌గా కొనసాగుతున్నది. ప్రతీ వారం అభిమానులను ఎదురు చూసేలా చేసింది.

గత మూడు సీజన్లకు విశేషమైన ఆదరణ దక్కడంతో నాలుగో సీజన్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లక్కీ భాస్కర్ హీరో దుల్కర్ సల్మాన్‌తో ప్రారంభించారు. ఈ రెండు ఎపిసోడ్స్‌కు భారీ స్పందన వచ్చింది. ఆ క్రమంలో మరో స్టార్ హీరో సూర్య, ఆయన నటిస్తున్న కంగువా టీమ్ ఈ షోలొకి వచ్చారు.
అయితే ఎప్పటిలానే బాలయ్య తన కంటెస్టెంట్లను ప్రశ్నలతో తికమకపెడుతూ చిలిపిగా, సరదాగా షోను కనిపించినట్టు తాజా ప్రోమో వెల్లడించింది. బాలయ్య కొంటెతనం.. సూర్య సిగతనం ప్రోమోలో హైలెట్‌గా నిలిచాయి. బాలకృష్ణ ప్రశ్నలు వేసి సూర్య నుంచి జవాబులు రాబట్టిన తీరు అందర్నీ నవ్వుల్లో ముంచెత్తేలా ఉంది.
అన్ స్టాపబుల్ 4 సీజన్ ప్రారంభిస్తూ.. నేను సింహం అయితే.. ఆయన సింగం.. నేను లెజెండ్ అయితే ఆయన గజని.. నేను అఖండ అయితే ఆయన రోలెక్స్.. వన్ అండ్ ఓన్లీ సూర్య.. అంటే స్వాగతం పలికాడు. గజని సినిమాలో హృదయం ఎక్కడున్నది? అనే పాటపై స్టెప్పులు వేశాడు. మీరు అందంగా ఉన్నారంటూ సూర్య కితాబు ఇచ్చారు.
కార్తీ, సూర్య మధ్య ఫిట్టింగ్ ప్రశ్నను బాలయ్య వేస్తూ.. నీ ఫోన్‌లో నీ తమ్ముడి పేరును ఏమని ఫీడ్ చేసుకొన్నావు. చివరి సారిగా నీకు కార్తీకి ఎప్పుడు గొడవ అయింది అంటూ ప్రశ్నించారు. దాంతో ఫస్ట్ క్వశ్చన్ అవుటాఫ్ సిలబసా? అంటూ సూర్య తలపట్టుకొన్నాడు. మీ ఇద్దరి అన్నదమ్ములు అనుబంధం కదా? ఏ విషయంపై గొడవ పడ్డారు అని అడిగారు. కార్తీకి వాట్సప్ కాల్ చేసి.. మీ అన్నయ్య అన్ని అబద్దాలే చెబుతున్నాడు అని అంటే.. అవును చిన్నప్పటి నుంచి అబద్దాలే ఆడుతాడు అని కార్తీ అసలు విషయం బయటపెట్టేశాడు.
తమిళ స్టార్ హీరో సూర్య విషయానికి వస్తే.. దర్శకుడు శివ దర్శకత్వంలో కంగువ భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమాలో నటిసత్ున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నది.


Click it and Unblock the Notifications











