Unstoppable ఇండియన్ ఐడల్ తెలుగులో బాలకృష్ణ.. ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక రచ్చే!
అఖండ సినిమా విజయంతో నందమూరి బాలకృష్ణ సూపర్ ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతానికి ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. అయితే ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఓటీటీలో ఒక ప్రోగ్రాం చేసి హిట్ కొట్టిన బాలకృష్ణ ఇప్పుడు ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో కోసం ఉన్న ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ షో ఎప్పుడు ప్రసారమవుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ తాజాగా ఈ షో ప్రసారం అయ్యే డేట్ ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

బాలకృష్ణ కెరీర్ లోనే
చివరగా అఖండ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ. తనకు బాగా కలిసి వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన అఖండ సినిమా చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా పూర్ణ, శ్రీకాంత్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాకుండా బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా కూడా నిలిచింది.

డిజిటల్ లో కూడా
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం అన్ స్టాపబుల్ అనే ఒక షో చేశారు. ఈ షో సూపర్ హిట్ గా నిలిచింది. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్న ఈ షోలో పది మంది గెస్ట్ లను పిలిపించి వారి మనోగతాన్ని బాలకృష్ణ ఆవిష్కరించారు. అలా ఒకపక్క సినిమాల్లో మరోపక్క డిజిటల్ లో కూడా సూపర్ హిట్స్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నారు.

ఎప్పుడెప్పుడా అని
ఈ నేపథ్యంలోనే ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సోలో సెమీ ఫైనల్స్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందా అని అటు నందమూరి అభిమానులు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

జూన్ పదో తేదీన
జూన్ పదో తేదీన రాత్రి తొమ్మిది గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతోందని ఆహా వీడియో అధికారికంగా ప్రకటించింది, ఈ షోకి తమన్, నిత్య మీనన్, కార్తీక్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్ లు సెమీఫైనల్స్లో ఉన్నారు. వారిలో కొంతమంది ఫైనల్స్ కు వెళ్లే అవకాశం ఉంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో
నందమూరి బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతానికి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











