India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Unstoppable 2 పై మొదటిసారి అఫీషియల్ గా స్పందించిన బాలకృష్ణ.. కొనసాగింపే అంటూ..

  |

  అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ కూడా ఈ షోకు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. గతంలో ఎప్పుడు లేని విధంగా నందమూరి బాలకృష్ణ చేసిన ఈ ప్రయోగం భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. అయితే ఫస్ట్ సీజన్ ముగిసిన అనంతరం రెండవ సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని చూసిన ఆడియెన్స్ కు ఇటీవల నందమూరి బాలకృష్ణ మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఆయన ఏం చెప్పారు ఎప్పుడు స్టార్ట్ కానుంది అనే వివరాల్లోకి వెళితే..

  క్రేజ్ పెంచుకున్న ఆహా

  క్రేజ్ పెంచుకున్న ఆహా

  నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా ఓటీటీలో ఫ్లాట్ ఫామ్ లో చేసిన అద్భుతమైన అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. అంతేకాకుండా బాలయ్య బాబును అన్ని వర్గాల ఆడియెన్స్ కు ఈ టాక్ షో మరింత దగ్గరయ్యేలా చేసింది. ఇక అప్పటివరకు ఒక రేంజ్ లో ఉన్న ఆహా షోకు అన్‌స్టాపబుల్ షో అనంతరం ఒక్కసారిగా జనాల సపోర్ట్ పెరిగింది. సబ్‌స్క్రైబర్స్ పెరగడంలో కూడా ఈ షో బాగానే హెల్ప్ చేసింది.

  నెంబర్ వన్ టాక్ షో

  నెంబర్ వన్ టాక్ షో

  అన్‌స్టాపబుల్ విత్ NBK డిజిటల్ వరల్డ్ అత్యధిక క్రేజ్ అందుకున్న వాటిలో టాప్ లిస్ట్ లో చేరడం విశేషం. ముఖ్యంగా IMDB సర్వే ప్రకారం ఇండియాలో ప్రసారమయ్యే టాక్ షోలలో అత్యధికంగా 9.7 రేటింగ్‌తో అన్‌స్టాపబుల్ మొదటి స్థానంలో నిలవడం విశేషం.

  సెకండ్ సీజన్

  సెకండ్ సీజన్

  ఇక ఆ రేంజ్ లో సక్సెస్ అయిన ఇలాంటి షోకు సీజన్ 2ను తీసుకు రాకుండా ఎలా ఉంటారు. అందుకే త్వరలోనే సరికొత్తగా స్టార్ సెలబ్రెటీలతో అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 మొదలు పెట్టబోతున్నారు. ఇక రీసెంట్ గా తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకు ప్రత్యేక అతిథిగా వచ్చిన బాలకృష్ణ ఈ విషయంపై మొదటిసారి క్లారిటీ ఇవ్వడం విశేషం.

  క్లారిటీ ఇచ్చిన బాలయ్య

  సింగర్ శ్రీరామచంద్ర వినయంగా బాలకృష్ణను అన్‌స్టాపబుల్ సీజన్ 2 పై అప్డేట్ ఇవ్వమని అడుగగా మధుర క్షణాలకు ముగింపు ఉండదు.. కొంసాగింపే.. అంటూ బాలయ్య బాబు తనదైన శైలిలో మైక్ తిప్పుతూ అదిరిపోయేలా అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఈ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఇటీవల ఆహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  అప్డేట్ ఎప్పుడంటే?

  అప్డేట్ ఎప్పుడంటే?

  ఇక షోకు సంబంధించి ప్రత్యేకమైన అతిధులుగా ఎవరెవరు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ సీజన్ లో మోహన్ బాబు ఫ్యామిలీతో స్టార్ట్ చేసి ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆడియెన్స్ అంతకుమించి అనే తరహాలో గెస్టులు వస్తారని ఊహించుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఆగస్టు 15న సెకండ్ సీజన్ కు సంబంధించిన ప్రోమో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  అగ్ర హీరోలు?

  అగ్ర హీరోలు?

  ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలు మాట్లాడితే చూడాలని ఉందని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ప్రభాస్ తో పాటు కోలీవుడ్ అగ్ర హీరోలు కూడా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరి నిర్వాహకులు సెకండ్ సీజన్ లో ఎవరెవరిని తీసుకు వస్తారో చూడాలి.

  English summary
  Nandamuri balakrishna special update on Unstoppable with NBK season 2
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X