Unstoppable NBK 2: పవన్ కళ్యాణ్ నిజంగానే.. అలా డౌట్ క్రియేట్ చేసిన బాలకృష్ణ!
నందమూరి బాలకృష్ణ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ కూడా ఫుల్ జోష్ తో మొదలైంది. ఇక రాబోయే రోజుల్లో మరి కొంతమంది స్టార్ సెలబ్రిటీలు ఈ టాక్ షోలోకి ప్రత్యేక గెస్టులుగా రాబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నారా లోకేష్ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సెకండ్ ఎపిసోడ్లో ఇద్దరూ హీరోలు సందడి చేస్తున్నారు. ఇక త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అందుకు ప్రత్యేకంగా బాలకృష్ణ కూడా ఒక హింట్ అయితే ఇచ్చేసాడు. ఆ వివరాల్లోకి వెళితే...

మొదట్లో కొన్ని అనుమానాలు
కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా ఓటిటి షో తో కూడా బాలయ్య బాబు తన అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నాడు. మొదట అసలు ఈ షో సక్సెస్ అవుతుందా లేదా అని అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ బాలయ్య బాబు తనదైన టైమింగ్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ టాక్ షో సెకండ్ సీజన్లో గతంలో ఎప్పుడో లేనివిధంగా సరికొత్త సెలబ్రిటీలో రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

రిస్క్ చేశారు
సెకండ్ సీజన్లో అసలైతే ఒక స్టార్ హీరోతో ఫస్ట్ ఎపిసోడ్ మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ హఠాత్తుగా ప్లాన్ చేంజ్ చేసి చంద్రబాబు నాయుడిని రంగంలోకి దించారు. పొలిటికల్ పరంగా ఏదైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని తెలిసినప్పటికీ ఈ తరహా రిస్క్ అయితే చేశారు. ఒక విధంగా ఇది అల్లు అరవింద్ వ్యూహం అని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబునాయుడు ఎపిసోడ్ కు మంచి క్రేజ్ అయితే దక్కింది.

రెండవ సీజన్ లో గెస్టులు
అన్ స్టాపబుల్ షోలోకి రెండవ సీజన్లో రాబోయే మిగతా గెస్టులు ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు అయితే విలువడుతున్నాయి. ఇదివరకే కొంతమంది మెగా హీరోలు కూడా ఈ షోలోకి రావడానికి ఒప్పుకున్నట్లుగా చాలా రకాల కథనాలు వెలుపడ్డాయి. అలాగే స్టార్ దర్శకులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయితే వినిపించింది. ప్రభాస్, వెంకటేష్, నాగార్జున పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ వస్తే..
ఇక గత కొంతకాలంగా అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పాల్గొనబోతున్నట్లు పలు రకాల వార్తలు అయితే వినిపించాయి. ఒక విధంగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటే మాత్రం ఫ్యాన్స్ కి పండగే అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ ఈ షో కూడా నెంబర్ వన్ స్థానంలోకి వెళ్లిపోవడం పక్కా. అలాగే మెగాస్టార్ చిరంజీవి వచ్చినా కూడా షోకు మంచి క్రేజ్ అయితే దక్కుతుంది.

అలా డౌట్ క్రియేట్ చేసిన బాలయ్య
ఇక ఇటీవల విడుదల చేసిన ఒక ప్రోమో లో పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉన్నట్లు బాలయ్య ఒక హింట్ అయితే ఇచ్చేసాడు. రెండో ఎపిసోడ్లో సిద్దు జొన్నలగడ్డ విశ్వక్ ఇద్దరు కూడా స్పెషల్ గెస్ట్ లుగా పాల్గొన్నారు. ఇక మధ్యలో యువ నిర్మాత సీతారా ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ కూడా పాల్గొన్నాడు. అయితే అప్పుడే బాలకృష్ణ త్రివిక్రమ్ కు ఫోన్ చేశాడు. బాలయ్య ఫోన్ చేయగానే షోకు ఎప్పుడు వస్తున్నారు అని అడగ్గానే.. మీరు ఎప్పుడు అంటే అప్పుడు అని త్రివిక్రమ్ చెప్పాడు. ఇక అందుకు బాలయ్య ఎవరితో రావాలో తెలుసుగా అని కూడా అనేశాడు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి అంటే కాలమే సమాధానం చెప్పాలి.4


Click it and Unblock the Notifications











