Unstoppable 2: పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఎపిసోడ్స్ లో ఏది పెద్ద హిట్.. ఆహాకు అన్ని కోట్లా లాభాలు?

పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ గా అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ లో అత్యధిక స్థాయిలో క్రేజ్ అందుకున్న ఎపిసోడ్స్ లో ముగ్గురు అగ్ర హీరోల ఎపిసోడ్స్ టాప్ లిస్టులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ పవన్ కళ్యాణ్ మధ్యలో పోటీ గట్టిగానే నడిచినట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు ఎపిసోడ్స్ కారణంగా ఆహాకు ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే...

న్యాయం చేస్తాడా లేదా?

న్యాయం చేస్తాడా లేదా?

ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో అనగానే అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ బాలకృష్ణ హోస్ట్ గా కనిపించబోతున్నారు అనగానే ఒక్కసారిగా జనాల్లో ఆదరణ పెరిగిపోయింది. అయితే బాలకృష్ణ ఇప్పటివరకు అలాంటి షోలను చేయలేదు కదా న్యాయం చేస్తాడా లేదా అనే విధంగా కూడా రకరకాల కథనాలు వెలువడ్డాయి. కానీ బాలకృష్ణ మొదటి ఎపిసోడ్ తోనే మంచి రెస్పాన్స్ అందుకున్నారు.

మొదటి సీజన్ లో అదే టాప్

మొదటి సీజన్ లో అదే టాప్

ఇక మొదటి సీజన్లో పాల్గొన్న సెలబ్రిటీల కారణంగా ఆహాకు ఫాలోవర్స్ కూడా గట్టిగానే పెరిగారు. ముఖ్యంగా మహేష్ బాబు ఎపిసోడ్ తో మొదటి సీజన్ ను ముగించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎపిసోడ్స్ కారణంగా కూడా సబ్ స్క్రైబర్స్ భారీ స్థాయిలో పెరిగారు. ఆ సీజన్ లో అదే టాప్. ఇక మహేష్ బాబు ఎపిసోడ్ తర్వాత మళ్లీ కొంత గ్యాప్ తీసుకొని అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ ను కూడా గ్రాండ్గా మొదలు పెట్టారు ఇక అప్పుడు కూడా మంచి రెస్పాన్స్ అందుకోవడం విశేషం.

 ప్రభాస్ దెబ్బకు..

ప్రభాస్ దెబ్బకు..

ఇక రెండవ సీజన్ లో ఈసారి అగ్ర హీరోలు పాల్గొనడంతో రేంజ్ పెరిగింది. ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంతలా అంటే జనాలు ఆహా సబ్క్క్రిప్షన్ తీసుకోవడానికి ఎగబడేంతగా. ఇక ఆహా యాప్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. సమయానికి యాప్ కూడా ఓపెన్ కాలేదు. ఆ తర్వాత మళ్లీ సరికొత్తగా యాప్ ను మొదలుపెట్టాల్సి వచ్చింది.

బిగ్గెస్ట్ ఎపిసోడ్ గా..

బిగ్గెస్ట్ ఎపిసోడ్ గా..

ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఒక టాక్ షోలో పాల్గొనడమే కాకుండా తన జీవితంలో నేను కాంట్రవర్సీ విషయాల గురించి ఆ ఎపిసోడ్లో వివరణ ఇచ్చారు. దానికి తోడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ రాగానే జనాల్లో ఆదరణ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో రెండు సీజన్స్ లో అత్యధిక స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న ఎపిసోడ్ గా పవన్ ఎపిసోడ్ నిలిచింది.

పవన్, ప్రభాస్ లతో కోట్ల లాభాలు?

పవన్, ప్రభాస్ లతో కోట్ల లాభాలు?

అయితే పవన్ కళ్యాణ్ అలాగే ప్రభాస్ ఎపిసోడ్ ద్వారా ఆహా కు భారీ స్థాయిలోనే లాభాలు వచ్చాయి. అన్ స్టాపబుల్ షో కోసం ఆహాతో బ్రాండ్ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకొని భారీ స్థాయిలోనే ఆఫర్స్ చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం రెండు ఎపిసోడ్స్ ద్వారానే ఆహా 17 కోట్లకు పైగా క్యాష్ చేసుకున్నట్లు సమాచారం.

గెస్ట్ లకు డబ్బులు ఇస్తున్నారా?

గెస్ట్ లకు డబ్బులు ఇస్తున్నారా?

కేవలం బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కోట్లల్లో ఆదాయం పొందుకున్న ఆహా మరోవైపు సబ్ స్క్రైబర్స్ కూడా పెరగడంతో అటు నుంచి కూడా భారీ ఆదాయం లభించింది. అయితే వచ్చిన గెస్ట్ లకు కూడా కొన్ని ఖరీదైన కానుకలు కూడా ఇస్తున్నట్లు సమాచారం. వారి సమయాన్ని వదిలేసుకొని మరి వస్తున్నారు అంటే కొంతమంది స్టార్స్ కు మాత్రం ఖరీదైన కానుకలు అందినట్లుగా కూడా తెలుస్తోంది. మరికొందరు వారి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీగానే అన్ స్టాపబుల్ లోకి వస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X