Unstoppable With NBK 2: నీ ఫోన్ లో ఎన్ని బిట్స్ ఉన్నాయి.. బట్టలు విప్పేయాలి: శర్వాతో బాలయ్య

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సీజన్ 2 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. విభిన్నమైన గెస్టులతో బాలయ్య బాబు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇక సెకండ్ సీజన్ మూడవ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్టులుగా అడివి శేష్, శర్వానంద్ వచ్చారు. వారితో బాలయ్య గేమ్ మామూలుగా కొనసాగలేదు. బోల్డ్ ప్రశ్నలతో కూడా యువ హీరోలకు చెమటలు పెట్టించాడు. ఇక నవంబర్ 4న ఆహా లో స్ట్రీమింగ్ కాబోయే ఆ ఎపిసోడ్ హైలెట్స్ లోకి వెళితే..

రష్మికతో బాలయ్య కాల్

రష్మికతో బాలయ్య కాల్

అడివి శేష్ వచ్చి రాగానే బాలయ్య కాళ్లకు నమస్కారం చేయడంతో చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అని అలా నమస్కారం చేయకూడదని అన్నాడు. ఇక అడివి శేష్ కన్ఫ్యూజ్ అవ్వడంతో ఆయన పేరు బాలయ్య ఆయన ఇంకా బలయ్యే అని శర్వా వయసును తగ్గించినట్లు చెప్పాడు. ఇక బాలయ్య కోసం శర్వానంద్ రష్మికకు వీడియో కాల్ చేశాడు. ఆమెతో మాట్లాడిన బాలయ్య అలానే ఆ ఫోన్ ను జేబులో పెట్టుకున్నాడు.

నీ ఫోన్ లో ఎన్ని బిట్లు ఉన్నాయని

నీ ఫోన్ లో ఎన్ని బిట్లు ఉన్నాయని

ఇక శర్వానంద్ చెబుతూ.. నేను అడివి శేష్ తో కలిసి రన్ రన్ రాజా రన్ అనే సినిమా చేశాము అని అప్పుడు అతను జిమ్ లో బాగా బరువులు ఎత్తేవాడు అనగానే అందుకు బాలయ్య అమ్మాయిలను చూసుకుంటూ చేసేవాడా అని కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆ తరువాత కాకతీయ హిల్స్ లో ఎన్ని గజాల బిట్లు ఉన్నాయని అడిగిన బాలయ్య ఆ తరువాత శర్వాను నీ ఫోన్ లో ఎన్ని బిట్లు ఉన్నాయని అడిగాడు. దీంతో శర్వానంద్ ఏమి అనలేకపోయాడు.

బీ సెంటర్ తెలివి తేటలు

బీ సెంటర్ తెలివి తేటలు

ఇక ఆ తరువాత మీరు ఒక 100 సినిమాలు చేస్తే అందులో ఒక 30 మంది హీరోయిన్స్ తో చేసుంటారు కదా అని శర్వా బాలయ్యను డౌట్ తో ఒక ప్రశ్న అడిగాడు. పక్కనే ఉన్న శేష్ చేసుంటారా ఏమిటి? అని అనడంతో యాక్టింగ్ చేసి ఉంటారు కదా అని అన్నాను.. అని శర్వా అన్నాడు. ఇక ఇవన్నీ బీ సెంటర్ తెలివి తేటలు అని బాలయ్య కౌంటర్ ఇచ్చాడు.

 ఎవరు నెంబర్ వన్ హీరో

ఎవరు నెంబర్ వన్ హీరో

ఇక తరువాత బాలయ్య నీ సినిమాల్లో హీరయిన్ సెలక్షన్ ఎలా ఉంటుంది అని అడిగాడు. అలాగే బాలకృష్ణ నాగార్జున చిరంజీవి వెంకటేష్ వీరిలో ఎవరు నెంబర్ వన్ యాక్టింగ్ అని కూడా శర్వాను అడిగాడు. దీంతో శర్వా దెబ్బకు దండం పెట్టేశాడు. ఇక పెళ్లి విషయంలో అందరూ అడుగుతూనే ఇండస్ట్రీలో శర్వానంద్, ప్రభాస్ లాంటి వాళ్ళు చాలామంది పెళ్లి చేసుకోలేదని శేష్ ఆన్సర్ ఇచ్చాడు. ఇక నేను ఆయన పేరు చెప్పుకుంటే నువ్వు నా పేరు చెబుతున్నావ్ అని శర్వా కౌంటర్ ఇచ్చాడు.

బట్టలు విప్పేయాలని ట్విస్ట్

బట్టలు విప్పేయాలని ట్విస్ట్

ఇక కిస్సు వద్దురా బాబు అనుకునే హీరోయిన్స్ లలో పూజా హెగ్డే ఒకరని అడివి శేష్ ఆన్సర్ ఇచ్చాడు. అనంతరం బాలయ్య శర్వా జాను యాక్సిడెంట్ విషయాన్ని కూడా ఎమోషనల్ గా అడిగాడు. ఆ తరువాత మళ్ళీ వెంటనే గేమ్ ఉందని.. ట్రుథ్ మ్యాటర్ అయితే బట్టలు విప్పేయాలని ట్విస్ట్ ఇచ్చారు. ఇక సెల్ఫీ అడిగితే చెంప పగలగొట్టే హీరో ఎవరని ప్రశ్నించగా.. శర్వా, శేష్ బాలయ్య వైపు చేతులు చూపించారు. ఇక ఈ షోలో హీరోలతో కలిసి బాలయ్య డ్యాన్స్ కూడా చేశారు. మరి ఫుల్ ఎపిసోడ్ లో ఇంకా ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X