Unstoppable With NBK: సుహాసినితో అలాంటి బంధం.. కానీ శ్రీయతో మాత్రం ఆ రిలేషన్.. చిలిపిగా బాలయ్య!
గాడ్ ఆఫ్ మాసెస్.. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో గురించి అందరికీ తెలిసిందే. కేవలం నటన, మాస్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా తనలోని యాంకరింగ్ టాలెంట్ ను కూడా ఈషోతో బయట పెట్టాడు బాలయ్య బాబు. తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూలు చేస్తూ కొత్త కొత్త విషయాలను రాబట్టడంలో ఈయన మించిన వాళ్లు లేరని అనిపించుకున్నారు. ఓవైపు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు వచ్చిన గెస్టులను ప్రశ్నలతో ఓ ఆడ ఆడేసుకుంటున్నారు. అయితే ఈ షోకు స్టార్ హీరోహీరోయిన్లతో పాటు రాజకీయ నాయకులు కూడా రావడంతో మరింత క్రేజ్ పెరిగిపోయింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వేధికగా వస్తున్న ఈ షోకు విశేష స్పందన లభిస్తుంది. అయితే ఇటీవలే ప్రారంభం అయిన మూడో సీజన్ లో ముందుగా బాలకృష్ణ హీరోగా చేసిన భగవంత్ కేసరి సినిమా టీంను తీసుకొచ్చి సందడి చేశారు. అలాగే ఇటీవలే రెండో ఎపిసోడ్ కోసం యానిమల్ టీంను తీసుకు వచ్చారు. ముఖ్యంగా రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నాలతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను పిలిచి అద్భుతంగా ఇంటర్వ్యూ చేశారు. ఎవరూ ఊహించని స్థాయిలో ఈ ఎపిసోడ్ కు రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా మూడో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు, బాలయ్య బాబు వీళ్లతో ఎలా ఎంజాయ్ చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రోమో ప్రారంభం అవ్వడంతోనే సుహాసిని స్టేజీపైకి వచ్చింది. ఆప్యాయంగా పలకరించిన బాలకృష్ణ ఆమెను కూర్చోబెట్టగానే శ్రియా శరణ్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్, జయంత్ సి పరాంజీలు స్టేజీ మీదకు వచ్చి సందడి చేశారు. ముఖ్యంగా వచ్చిన గెస్టులతో చేతులు కలిపి నలుగురు నిలబడ్డారు. ఈక్రమంలోనే సుహాసినితో నాది జన్మజన్మల బంధం అని చెప్పుకొచ్చాడు బాలకృష్ణ. ఇక ఆ తర్వాత వెంటనే శ్రియ శరణ్ తో ఈ మిలీనియం బంధం అంటూ వెల్లడించాడు. దీనికి గెస్టులతో పాటు ఆడియన్స్ అందరూ గట్టిగా నవ్వారు.
ఇక ఆ తర్వాత బాలకృష్ణ గురించి సుహాసిని మాట్లాడుతూ.. అప్పుడు బాలా చాలా షై అనగానే శ్రియ అరిచింది. మరోవైపు హరీష్ శంకర్... నేను నమ్మను నేను నమ్మను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆతర్వాత ఇప్పుడు నేను కావాలనే మీ ముగ్గురితో మాట్లాడుతున్న హరీష్ ను అవైడ్ చేస్తున్నాని అన్నాడు. అందుకు పరాంజీ ఎందుకు పాపం అని అడగ్గా... నాకు ఆయనకు కొన్ని పాత కక్షలు ఉన్నాయయ్యా అంటూ తెలిపారు.
ఎవరైనా గెస్టును ప్రశ్నలు అడగడం మర్చిపోయారా అంటే నిన్ను చూసే మర్చిపోయానని చెబుతూ.. శ్రియకు లవ్ సింబల్ పెట్టి చూపించాడు. ఆ తర్వాత చెన్నకేవశ రెడ్డి సినిమాలోని పాటకు ఇద్దరూ స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఇలా ప్రోమో పూర్తవగా.. డిసెంబర్ 22వ తేదీ నుంచి ఆహా వేధికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రోమోనే ఇంత అద్భుతంగా ఉండగా.. ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో వచ్చిన వెంటనే చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











