Unstoppable 3 నటసింహం బాలయ్య గ్రాండ్ ఎంట్రీ... భగవంత్ కేసరి కోసం క్రేజీగా అన్‌స్టాపబుల్ 3!
సింహంలా గర్జించడానికి.. నటసింహం బాలయ్య బాబు వచ్చేస్తున్నాడు.. థియేటర్లోకి కాదండి.. స్మాల్ స్క్రీన్ పై మళ్లీ తన సత్తా ఏంటో చూపించడానికి అన్ స్టాపబుల్ గా వచ్చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ.. ఇప్పటికే అన్ స్టాపబుల్ హిట్లతో సినిమాలు చేస్తూ అన్ స్టాపబుల్ గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మరోసారి ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ సీజన్ 3 తో అలరించడానికి వచ్చేస్తున్నాడు. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోమో చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అంతే. ఆ వివరాల్లోకి వెళితే...
నందమూరి బాలకృష్ణ... ఈ పేరు వింటేనే చాలా మందికి జోష్ వచ్చేస్తుంది. సిచ్యూవేషన్ తో సంబంధం లేకుండా జై బాలయ్య అంటూ అరిచేస్తూ ఉంటాం. ఏ థియేటర్ దగ్గరకు వెళ్లినా.. ఏ హీరో సినిమా అయినా.. జై బాలయ్య అనాల్సిందే. అంతలా ఆయన క్రేజ్ జనాల్లో ఉంది మరి. ఇక నందమూరి వారసుడిగా సినిమాల్లోకి ఎంటర్ అయి.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును తెచ్చుకున్నాడు నందమూరి నటసింహ బాలకృష్ణ.

ఇక బాలయ్య ఇటీవల కాలంలో ఫుల్ జోష్ లోఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక కరోనా టైం నుంచి బాలయ్య టైం మారిందనే చెప్పాలి. అందరూ సినిమా రిలీజ్ కు బయపడుతుంటే.. ఆయన మాత్రం అఖండగా వచ్చి.. సూపర్ హిట్టుని కొట్టారు. ఇక సినిమా పరిశ్రమ గందరగోళంలో ఉంటే.. ఆయన ఓ మార్గం చూపించారు.
అఖండ సినిమా తర్వాత ఆయన అన్ స్టాపబుల్ షోతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఈ షో ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అయింది. ఈ షో అయితే సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరక్కిన ఈ అన్ స్టాపబుల్ షో కు మంచి రెస్పాన్స్ రావడంతో.. అన్ స్టాపబుల్ సీజన్ 2 తీశారు. ఇక అది కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక రాజకీయ నాయకులను కూడా గెస్టులుగా పిలిచి.. బాలయ్య బాబు హోస్టుగా చేసి అదరగొట్టాడు.

zప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 3 తో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి బాలయ్య సిద్ధం అయ్యారు. ఇప్పటికే వీరసింహారెడ్డి సక్సెస్ తో జోష్ మీద ఉన్న ఆయన... ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో బిజి బిజిగా ఉన్నారు. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ విషయం పక్కన పెడితే.. తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 3 ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోమో చూస్తుంటే.. బాలయ్య ఫ్యాన్స్ కే కాదు.. మామూలు జనాలకు కూడా గూస్ బంప్స్ అని చెప్పవచ్చు.
ఇక ఈ ప్రోమోలో బాలయ్య స్టైలీష్ లుక్ లో ఎంటర్ అయ్యారు. ఇక ఈ ప్రోమోలో బాలయ్య నోట.. గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా.. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్ స్టాపబుల్ అంటూ డైలాగ్ చెప్తాడు. దెబ్బకి థింకింగ్ మారిపోవాలా... అన్ స్టాపబుల్.. ఈ పేరు శాన యేళ్లు యాదింటాది.. కలుద్దాం.. ఆహాలో..అంటూ డైలాగ్ తో ప్రోమోను ముగిస్తారు.
ఇక ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. ఇక ఈ షో మొదటి ఎపిసోడ్ దసరా కానుకగా చేసి.. దీపావళి పండక్కి రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అంతే కాదు ఈ మొదటి ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా వస్తారని ఇన్ సైడ్ టాక్. ఇక బాలయ్య, చిరు ఒకే వేదికపై సందడి చేస్తే.. ప్రేక్షకులకు అదే నిజమైన పండగ అని చెప్పవచ్చు. ఇక ఆరోజు వచ్చే వరకు ఆగాల్సిందే మరి.


Click it and Unblock the Notifications











