For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable With NBK: బాలయ్య టాక్ షోకు టీడీపీ అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.. వచ్చేది ఎప్పుడంటే?

    |

    ఇటీవల కాలంలో మోస్ట్ పాపులర్ షోగా మంచి గుర్తింపును అందుకున్న అన్‌స్టాపబుల్ విత్ NBK ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సీజన్ అసలు వర్కౌట్ అవుతుందా అని చాలామంది అనుకున్నప్పటికీ బాలయ్య బాబు డిఫరెంట్ టైమింగ్ తో హోస్ట్ గా ఆకట్టుకొని షోను బంపర్ హిట్ అయ్యేలా చేశాడు. అయితే ఈసారి ఈ టాప్ షోలోకి భిన్నమైన సెలబ్రిటీలు రాబోతున్నారు. ఇక అందులో పొలిటికల్ పవర్ఫుల్ లీడర్ కూడా రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

    అన్‌స్టాపబుల్ హిట్

    అన్‌స్టాపబుల్ హిట్

    కేవలం వెండితెరపై మాత్రమే పవర్ఫుల్ డైలాగ్స్ తో మెప్పిస్తూ వచ్చిన బాలయ్య బాబు ఊహించని విధంగా ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్టార్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో చాలా మంది హీరోలు హోస్ట్ గా వ్యవహరించారు. కానీ బాలయ్య బాబు తరహాలో మాత్రం ఎవరు ఆకట్టుకోలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. నేటి తరం జనరేషన్స్ కూడా బాలయ్య బాబును మాస్ స్టైల్ లోనే ఫాలో అవుతున్నారు.

     నెంబర్ వన్ షోగా

    నెంబర్ వన్ షోగా

    మొదటి సీజన్ మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆహా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ స్థాయి పెరగడానికి కూడా బాలయ్య బాబు టాక్ షో ఎంతగానో ఉపయోగపడింది. అత్యధిక మంది వీక్షించిన టాక్ షోల లో కూడా అన్‌స్టాపబుల్ టాప్ లిస్టులో చేరిపోయింది. ఇక సెకండ్ సీజన్ ఎప్పుడు మొదలుపెడతారని ఓవర్గం ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్నారు.

    హడావిడి మొదలైంది

    హడావిడి మొదలైంది

    అన్‌స్టాపబుల్ విత్ NBK 2 షోకు సంబంధించిన హడావిడి అయితే మొదలైపోయింది. ఇటీవల ఏకంగా స్పెషల్ సాంగ్ కూడా విడుదల చేశారు. అందులో బాలయ్య బాబు వాయిస్ కూడా హైలెట్ అయింది. అంతేకాకుండా స్పెషల్ పోస్టర్స్ కూడా మళ్లీ అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఈసారి ప్రముఖ సెలబ్రిటీలు చాలావరకు ఈ షోలో సందడి చేయబోతున్నట్లుగా అర్థమవుతుంది.

     చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

    చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

    అన్‌స్టాపబుల్ లో ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సందేహాలపై కూడా బాలయ్య బాబు ప్రశ్నలు అడగడం విశేషం. అందులో కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక టీడీపీ అధినేత బాలయ్య బాబు వియ్యంకుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ షోలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య బాబు చంద్రబాబుతో ప్రత్యేకంగా ఈ విషయం గురించి మాట్లాడడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

    ఎప్పుడు వస్తారంటే..

    ఎప్పుడు వస్తారంటే..

    త్వరలోనే అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 కు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ మొదలు కాబోతోంది. అయితే చంద్రబాబునాయుడు మాత్రం ఫస్ట్ ఎపిసోడ్లో కాకుండా కొన్ని ఎపిసోడ్స్ ముగిసిన తర్వాత మధ్యలో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి మెగా హీరోలు అలాగే మరి కొంతమంది స్టార్ హీరోలను కూడా బాలయ్య బాబుతో ముచ్చటించే ఛాన్స్ ఉన్నట్లు టాక్. మరి సెకండ్ సీజన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

    English summary
    Nandamuri balakrishna Unstoppable With NBK 2 chandrababu naidu as guest in one episode
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X