Unstoppable 2: సంక్రాంతికి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లేనట్లే.. మరో గెస్టుతో స్పెషల్ ప్లాన్ వేసిన బాలయ్య!

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ రోజురోజుకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. గతంలో ఎప్పుడు లేనివిధంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కనిపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే అన్ స్టాపబుల్ షో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ వచ్చింది.

అయితే ఆ ఎపిసోడ్ సంక్రాంతికి వస్తున్నట్లు ఆ మధ్య కూడా హడావిడి చేశారు. కానీ ఇప్పుడు ఆహా ప్లాన్ ప్రకారం మళ్ళీ పవన్ ఎపిసోడ్ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతికి మాత్రం మరో స్పెషల్ గెస్ట్ తో సందడి చేయబోతున్నారు. ఇక ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఇప్పుడు స్ట్రీమింగ్ కానుంది అనే వివరాల్లోకి వెళితే..

సరికొత్త మాస్ ఇమేజ్

సరికొత్త మాస్ ఇమేజ్

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో మొదలుపెట్టిన తర్వాత ప్రేక్షకుల్లో ఒక సరికొత్త మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు అనే చెప్పాలి. ఆయనలోని మరో కొత్త తరహా కోణం కూడా ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇంతకుముందు బాలయ్య ఒక లెక్క అన్ స్టాపబుల్ తర్వాత బాలయ్య మరొక లెక్క అనే విధంగా క్రేజ్ అందుకుంటున్నారు.

ఆహా రేంజ్ పెరిగేలా..

ఆహా రేంజ్ పెరిగేలా..


ముఖ్యంగా సెకండ్ సీజన్ అయితే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకంటోంది. ఒక విధంగా ఆహా రేంజ్ పెరగడానికి కూడా అన్ స్టాపబుల్ ఎంతగానో ఉపయోగపడింది. చాలామంది ఇప్పుడు ఆహాకు ఎక్కువ స్థాయిలో సబ్ స్క్రిప్షన్ నెంబర్స్ పెరగడానికి కారణం కూడా బాలయ్య షో అనే చెప్పాలి. ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఏ స్థాయిలో ఎగబడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏకంగా ఆహా సర్వర్ కూడా ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. అంతలా ఆహా కు మంచి రెస్పాన్స్ అయితే అన్ స్టాపబుల్ షో తీసుకువస్తుంది.

జనవరిలో హడావుడి

జనవరిలో హడావుడి

ఇక ఈ జనవరిలో మొత్తంగా కూడా నందమూరి బాలకృష్ణ ఆహా రేంజ్ ను మరొక లెవెల్ కు తీసుకు వెళ్లే విధంగా రెడీ అవుతున్నారు. ఇప్పటికే ముగ్గురు హీరోయిన్స్ తో ఆయన చేసిన ఒక ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ప్రభాస్ గోపీచంద్ లతో చేసిన ఎపిసోడ్ రెండు భాగాలుగా విభజించారు ఇప్పటికే ప్రభాస్ మొదటి భాగానికి మంచి గుర్తింపు లభించింది. ఇక జనవరి 6వ తేదీన ప్రభాస్ గోపీచంద్ కాంబినేషన్లో పార్ట్ 2 ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

సంక్రాంతికి పవన్ లేనట్లే..

సంక్రాంతికి పవన్ లేనట్లే..

అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవల పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక ఎపిసోడ్ ను సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు కూడా ఒక టాక్ వినిపించింది. కానీ లేటెస్ట్ గా ఆహా ప్లాన్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి టీమ్ తో ప్రత్యేకంగా జనవరి 13న ఒక ఎపిసోడ్ ప్రసారం చేయడానికి ప్లాన్ రెడీ చేశారు.

 పవన్ ఎపిసోడ్ ఎప్పుడంటే..

పవన్ ఎపిసోడ్ ఎప్పుడంటే..


వీరసింహారెడ్డి ప్రమోషన్స్ కోసం నందమూరి బాలకృష్ణ చిత్ర యూనిట్ సభ్యులతో ఓ ఎపిసోడ్ చేయబోతున్నాడు. అయితే మరి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కొత్త టాక్ వైరల్ గా మారింది. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను విడుదల చేస్తే బాగుంటుంది అని ఆహా టీం ప్లాన్ చేస్తోంది. మరి ఈ విషయంపై ఎప్పుడు అఫీషియల్ క్లారిటీ ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X