twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable With NBK రెండవ సీజన్ ప్లాన్ షురూ.. ఈసారి గెస్టులు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    |

    నందమూరి బాలకృష్ణ గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటి సారి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో టాక్ షోలో హోస్ట్ గా వ్యవహరించి మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ఆహా లో వచ్చిన అన్‌స్టాపబుల్ విత్ NBK ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండో సీజన్ కోసం కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే మొదటి సీజన్ కంటే రెండో సీజన్ లోనే చాలా మంది అగ్రహీరోలు ప్రత్యేక అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. రెండవ సీజన్ ఎప్పుడు మొదలు పెడతారు అలాగే ఎవరెవరు రాబోతున్నారు అనే వివరాల్లోకి వెళితే...

    ఆహా.. అన్‌స్టాపబుల్

    ఆహా.. అన్‌స్టాపబుల్

    నందమూరి బాలకృష్ణ అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు ఆయన అనుకుంటే హోస్ట్ గా కూడా మెప్పించగలడు అని ఆహా అన్‌స్టాపబుల్ టాక్ షో తో నిరూపించారు. నందమూరి బాలయ్య మొదటిసారి ఆహాలో అడుగుపెట్టడంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. దర్శకులు కమెడియన్లు హీరోలు ఇలా అందరితోనూ బాలయ్య టాక్ షోను కొనసాగించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది.

    కాంట్రవర్సీ టాపిక్స్

    కాంట్రవర్సీ టాపిక్స్

    ఆహా అన్‌స్టాపబుల్ షోలో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఏదో మంచి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతూ వచ్చారు. మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి ఆఖరికి మహేష్ బాబు ఎపిసోడ్ వరకు ఆడియెన్స్ నుంచి మంచి రియాక్షన్ వచ్చింది. బాలకృష్ణ అందరిలా కాకుండా కాంట్రవర్సీ టాపిక్స్ పై కూడా అనేక రకాల సందేహాలను అడగడం తో మంచి హైప్ ఐతే క్రియేట్ అయింది.

    రెండవ సీజన్ మరింత విభిన్నంగా..

    రెండవ సీజన్ మరింత విభిన్నంగా..

    మొత్తానికి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించినటువంటి టాక్ షో మరొక సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు గా తెలుస్తోంది. గతంలోనే ఈ విషయంపై నిర్వాహకులు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. తప్పకుండా బాలకృష్ణ మరొక సీజన్ తో అలరించబోతున్నారు అని కూడా వివరణ ఇచ్చారు. మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ మరింత విభిన్నంగా సరికొత్తగా ఉంటుందని అని కూడా చెబుతున్నారు.

     షూటింగ్ అనంతరం

    షూటింగ్ అనంతరం

    ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన 150వ సినిమాతో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయింది. ఇక బాలకృష్ణ మరొక నెల రోజుల పాటు నిర్విరామంగా ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనపోతున్నాడు ఇక ఆ తర్వాత అంటే జూన్ నెలలోనే షోకు కు సంబంధించిన రెండవ సీజన్ పనులు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    గెస్టులు ఎవరంటే..?

    గెస్టులు ఎవరంటే..?

    మొత్తంగా ఈ సమ్మర్ చివరిలోనే నందమూరి బాలకృష్ణ మళ్లీ తనదైన శైలిలో షోను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సారి గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనే విషయంలో కూడా అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేష్ నాగార్జున అలాగే ప్రభాస్ మరికొంత మంది యువ హీరోలు కూడా ఈ షోలో కి ప్రత్యేక అతిథులుగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

    English summary
    Nandamuri balakrishna Unstoppable With NBK season 2 plans started and guest list viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X