Unstoppable Trailer: అడ్వెంచర్ మూవీలా అన్‌స్టాపబుల్ ట్రైలర్.. బాలయ్య స్టంట్స్ చూస్తే షాకే!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ సత్తా చాటుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. హీరోగా ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయిన ఆయన.. మిగిలిన రంగాల్లో కూడా తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నారు. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితమే తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో Unstoppable with NBK Show అనే షోను హోస్ట్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఇదే షో రెండో సీజన్‌తో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య షో నుంచి అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని మీరే చూసేయండి మరి!

అఖండ హిట్.. రెండు మూవీలు
గత ఏడాది 'అఖండ' అనే సినిమాతో నందమూరి బాలకృష్ణ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. ఇదే ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే అనిల్ రావిపూడితో సినిమాను ప్రకటించారు. ఇలా గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో మూవీలను చేస్తూ వస్తున్నారయన.

హోస్టుగా బాలయ్య.. భారీ హిట్
ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే నందమూరి బాలకృష్ణ.. కొన్ని నెలల క్రితమే 'Unstoppable with NBK' అనే టాక్ షోతో హోస్టుగా మారిన విషయం తెలిసిందే. ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని గత నవంబర్‌లో ఈ టాక్ షోను అంగరంగ వైభవంగా మొదలెట్టారు. ఇది సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి రికార్డులు బ్రేక్ చేసింది.

ఓటీటీ చరిత్రలోనే తొలిసారి
స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్టుగా వచ్చిన హోస్టుగా వచ్చిన 'Unstoppable with NBK' టాక్ షో మొదటి సీజన్ భారీ స్పందనను అందుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆహా టీమ్ ఇప్పుడు రెండో సీజన్‌ను అక్టోబర్ 14వ తేదీ నుంచి మొదలు పెట్టబోతుంది. ఓటీటీ చరిత్రలోనే తొలిసారి ఈ షో కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా కూడా నిర్వహించారు.

రెండో సీజన్.. చంద్రబాబుతో
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేయబోతున్న 'Unstoppable with NBK 2' షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెస్టుగా రాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైంది. దీంతో ఈ ఎపిసోడ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.

అడ్వెంచర్ ఫిల్మ్‌గా ట్రైలర్
'Unstoppable with NBK 2' ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో బాలయ్య ఓ నిధి కోసం అడవిలోకి వెళ్లినట్లు చూపించారు. ఇందులో ఆయన సరికొత్త గెటప్‌తో కనిపించారు. అలాగే, కొన్ని స్టంట్లు కూడా చేసి సత్తా చాటారు. ఇక, చివర్లో మరో లుక్‌తో కనిపించిన బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు అందరినీ ఫిదా చేశారు. మొత్తానికి ఇది అడ్వెంచర్ ఫిల్మ్ ట్రైలర్‌గా అనిపించింది.
అంధకార అభయారణ్యంలోకి
'Unstoppable with NBK 2' ట్రైలర్‌లో బాలయ్య 'అంధకార అభయారణ్యంలో నిక్షిప్తమైన నిగూఢ నిధి ఊహించలేనిది.. అక్కడ ఎదరయ్యే సవాళ్లు అంచనా వేయలేనివి.. అయినా ఆగని మన పోరాటం అన్‌స్టాపబుల్. గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా.. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్' అంటూ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

ప్రశ్నల్లో మరింత ఫైర్ అంటూ
ఇదే ట్రైలర్‌లో బాలకృష్ణ 'ప్రశ్నల్లో మరింత ఫైర్.. ఆటల్లో మరింత డేర్.. సరదాల్లో మరింత సెటైర్.. మీకోసం మరింత రంజుగా.. దెబ్బకు థింకింగ్ మారిపోవాల' అంటూ 'Unstoppable with NBK 2' ఎలా ఉండబోతుందో చెప్పేశారు. దీంతో ఈ షోపై ఉన్న అంచానలన్నీ రెట్టింపు అయిపోయాయి. అదే సమయంలో ఈ ట్రైలర్ విపరీతంగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











