Unstoppable 2: షోలో షాకింగ్ సీన్.. బాలకృష్ణ నోటి నుంచి పచ్చి బూతు.. ఒక్కసారిగా

సరదా సరదాగా మాట్లాడుతూ మెల్లిగా సెలబ్రిటీల నుంచి సీక్రెట్స్ లాగే హోస్ట్ గా అన్‌స్టాపబుల్ షో లో నందమూరి బాలకృష్ణ అదరగొడుతున్నారు. తొలి సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఇటీవలే రెండో సీజన్ ను చాలా గ్రాండ్ గా ప్రారంభించారు. ఆ మొదటి ఎపిసోడ్ కు లక్షల్లో వ్యూస్ వచ్చి రికార్డు క్రియేట్ చేసింది. అదే జోష్ లో మరో ఎపిసోడ్ ను ప్రసారం చేశారు. ఇదివరకే విడుదల చేసిన రెండో ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి తాజాగా విడుదల చేసిన రెండో ఎపిసోడ్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అయితే ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ నోటి నుంచి వచ్చిన బూతు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

 యువ హీరోలతో సరిసమానమైన జోష్..

యువ హీరోలతో సరిసమానమైన జోష్..

తొలి ఎపిసోడ్ సూపర్ సక్సెస్ కావడంతో అదే జోష్ తో అన్‌స్టాపబుల్ 2 రెండో ఎపిసోడ్ ను తాజాగా విడుదల చేశారు. ఈ రెండో ఎపిసోడ్ కు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ హాజరైన విషయం తెలిసిందే. ఈ యువ హీరోలతో సరిసమానమైన జోష్ తో రెండో ఎపిసోడ్ ను కంప్లీట్ చేశాడు బాలకృష్ణ.

ఆ క్యారెక్టర్ చింపేసేవాన్ని..

ఆ క్యారెక్టర్ చింపేసేవాన్ని..

నిజ జీవితంలో మంచి స్నేహితులైన విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డలతో తనదైన శైలీలో ఆడుకున్నాడు బాలయ్య బాబు. అయితే ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఫిటింగ్ పెట్టే ప్రయత్నం చేశాడు బాలకృష్ణ. మీరిద్దరి మధ్య గొడవ పెడుతున్నానని అనుకోకండి అంటూనే.. ''డీజే టిల్లు చూసిన విశ్వక్ సేన్ నీకన్నా తనైతే ఆ క్యారెక్టర్ చింపేసేవాన్ని'' అని అన్నాడని సిద్ధుతో బాలయ్య చెప్పాడు.

 అప్పుడే ఫిటింగ్ పెడుతున్నారు..

అప్పుడే ఫిటింగ్ పెడుతున్నారు..

సర్ ఎంటీ సార్.. ఇప్పుడే షో స్టార్ట్ అయింది.. అప్పుడే ఫిటింగ్ పెడుతున్నారు అని నవ్వుకుంటూ విశ్వక్ సేన్ అంటే.. ''నువ్ ఇట్లంటవని అనుకోలేదు.. నాకు ఏం చెప్పాడో తెలుసా సార్.. నువ్ తప్పా ఇంకెవరు చేయలేరు'' అని అన్నాడని సిద్దు చెప్పాడు. సిద్ధూ నీ జుట్టు మీద ఒట్టు అంటూ బాలకృష్ణ అని నవ్వించాడు. మీరు పెద్ద ఫిటింగ్ పెట్టారు సార్ అని విశ్వక్ అని.. తర్వాత సారీ సిద్దు అని చెప్పాడు.

 చెమటలు తెప్పిస్తున్నారు..

చెమటలు తెప్పిస్తున్నారు..

సర్లే ఓకే నీ స్టాండర్డ్ కు తగినట్లు చేయలేకపోయిన కాబట్టి నేనేదో చేసుకుంటున్నా అని సిద్దు అన్నాడు. వస్తదిలే ఆ స్టాండర్డ్ అని బాలయ్య అంటే.. సార్.. ఇప్పుడే షో స్టార్ట్ అయింది, అప్పుడే చెమటలు తెప్పిస్తున్నారు అని విశ్వక్ సేన్ తెలిపాడు. ఈ క్రమంలోనే తను స్టోరీస్ ఎలా ఎంచుకుంటాడో విశ్వక్ సేన్ చెబితే.. పెద్ద శాడిస్ట్ వి అని బాలకృష్ణ కౌంటర్ వేశాడు.

అఫిషియల్ గా ఛాన్స్ ఇస్తున్నా..

అఫిషియల్ గా ఛాన్స్ ఇస్తున్నా..

ఆ తర్వాత నేను నీకు అఫిషియల్ గా డైరెక్టర్ ఛాన్స్ ఇస్తున్నా.. ఎప్పుడైన సరే.. ఓపెన్ ఆఫర్ అని విశ్వక్ తో అంటే అవునా సార్.. అని ఆశ్చర్యపోతాడు. తర్వాత నువ్ నన్ను ఇప్పుడు డైరెక్ట్ చేయమని అడగ్గా.. మీకు ఫ్యాన్స్ కావాలా.. హీరోయిన్ కావాలా.. అని అడుగుతాను, దానికి మీరు మింగితే.. షేప్ అవుట్ అవుతావ్ మసాల వడా అని అనమని చెబుతాడు విశ్వక్ సేన్.

నిజమైన బూతు చెప్పిన బాలయ్య..

నిజమైన బూతు చెప్పిన బాలయ్య..

అయితే ఆ డైలాగ్ చెప్పేటప్పుడు బాలయ్యా బాబు.. నిజమైన బూతును ఉపయోగించి చెప్పాడు. మింగితేకు బదులు ఒరిజినల్ డైలాగ్ కొట్టాడు.. అయితే ఈ డైలాగ్ ను ఎవరి అంతగా పట్టించుకోలేదు. ఒక్కసారిగా బాలయ్య నోటి నుంచి రావడంతో అదో ఫ్లోలో వెళ్లిపోయింది. కానీ ఈ వీడియో క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X