బాలకృష్ణ అఖండ 2 ఓటీటీ రైట్స్ కు భారీ ధర.. వామ్మో ఎన్ని కోట్లకు అమ్ముడైందో తెలుసా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ సక్సెస్ తో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు బ్లాక్ బాస్టర్ అవుతుండటంతో నందమూరి అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతే కాదు బాలకృష్ణ రాబోయే చిత్రాలకు కూడా మస్త్ డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే బాలకృష్ణ నెక్ట్స్ సినిమా అఖండ 2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినప్పుడు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

టీజర్ తో అఖండ 2 రచ్చ..
మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం అఖండ 2. 2021లో వచ్చిన అఖండ చిత్రానికి ఇది సీక్వెల్. ఇక అఖండ 2లోనూ బాలకృష్ణ రెండు పాత్రల్లో నటిస్తున్నారు. అందులో అఘోరిగా దుమ్ములేపుతున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ లోనూ అఘోరి పాత్రనే ప్రేక్షకులకు పరిచయం చేశారు. టీజర్ లో బాలకృష్ణకు ఇచ్చిన ఎలివేషన్స్, గ్రాండ్ వివజుల్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు దుమ్ములేచిపోయింది. ఒక్క టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇక 'స్కంద' చిత్రంతో దెబ్బతిన్న బోయపాటికి అఖండ 2 మంచి ఫలితాన్ని ఇవ్వబోతోందని తెలుస్తోంది.

Nandamuri Balakrishna s Akhanda 2 movie OTT rights price

అఖండ 2 ఓటీటీ రైట్స్..
4 ఏళ్ల కింద ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కింది.దీంతో సీక్వెల్ గా రాబోతున్న అఖండ 2 చిత్రంపైనా భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే టీజర్ దుమ్ములేపింది. దీంతో రాబోయే ప్రమోషనల్ మెటీరియల్ కూడా అదిరిపోతుందనే నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో చిత్రంపై మాత్రం భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో రిలీకు ముందే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ ను దక్కించుకునేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ పోటీ పడుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే అఖండ 2 ఓటీటీ రైట్స్ కోసం రూ.100 కోట్ల వరకు మేకర్స్ కోట్ చేశారంట. ఆ రెండు సంస్థలు రూ.80 కోట్ల వరకు వెచ్చించేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. మున్ముందు ఎంతకు అమ్ముడు పోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వరుస హిట్లతో దుమ్ములేపుతున్న బాలయ్య..
ఆరు పదుల వయస్సులోనూ నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్రాల పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ములేపుతున్నారు. అంతే కాదు యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ, బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే వరుసగా 4 చిత్రాలతో వరుసా బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహా రెడ్డి, డాకూ మహారాజ్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు. నెక్ట్స్ అఖండతో ఎలాంటి ఫలితం వస్తుందనేది వేచి చూడాలి.

బాలయ్య నెక్ట్స్ సినిమాలు..
అఖండ 2 తర్వాత బాలకృష్ణ ఎలాంటి చిత్రాల్లో నటిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'జైలర్ 2' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మలయాళ చిత్రం 'మార్కో' మూవీ దర్శకుడు హనీఫ్ తో పోలీస్ సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X