OTTలోకి జీరో కలెక్షన్స్​ ఇంటెన్స్ థ్రిల్లర్​... మీకు చూసే డేర్ ఉందా?

ఓటీటీలోకి మరో కొత్త సినిమా వచ్చేసింది. అది కూడా నందమూరి హీరో సినిమా. అదేనండి.. నందమూరి చైతన్య కృష్ణ నటించిన బ్రీత్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ హీరో సొంతం చేసుకోని రికార్డును సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ మెడికో థ్రిల్లర్ సినిమా ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయలేదు. అదేంటి అనుకుంటున్నారా.. అసలు ఈ సినిమాను ఎవరు ఆదరించకపోవడానికి కారణం ఏంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చి సెటిల్ అయ్యారు. నందమూరి ఎన్టీఆర్ నుంచి మొదలైన ఆ ప్రస్థానం.. జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎంతో మంది హీరోలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అయితే నందమూరి ఎన్టీరామారావు కొడుకుల్లో జయకృష్ణ ఒకరు. ఆయన కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ. ఈయకు సినిమాలంటే మహా ఇష్టం. దీంతో అప్పట్లో ఓ సినిమాలో హీరోగా నటించాడు కూడా. అయితే ఆ సినిమా వచ్చింది పోయిందనే విషయం కూడా ఎవరికి తెలియదు.

Nandamuri Chaitanya Krishna Intense Thriller Breathe Movie Streaming on Aha OTT From March 8th Full Details Here

నందమూరి హీరో సినిమా...:ఇక ఇటీవల చైతన్య కృష్ణ నటించిన తాజా చిత్రం బ్రీత్. 5 పదుల వయసులోనూ హీరోగా నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకున్నారు. వంశీకృష్ణ ఆకేళ్ల ద‌ర్శ‌క‌త్వంలో బ్రీత్ అనే సినిమాలో హీరోగా నటించారు. మెడికో థ్రిల్లర్, ఇంటెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో వైదిక సెంజలియా ఆయన సరసన హీరోయిన్‌గా న‌టించింది. వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, మధు నారాయణ్ కీల‌క పాత్ర‌ల్లో నటించారు.

డిజాస్టర్ సినిమగా...:బ్రీత్ సినిమా గతేడాది డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేకపోవడం.. సరైన ప్రమోషన్స్ లేకపోవడం.. అంతే కాదు.. నందమూరి హీరో చైతన్య కృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలు మాత్రం ట్రోలింగ్ అవ్వడంతో బ్రీత్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ సినిమగా నిలిచింది. కనీసం వసూళ్లు కూడా రాబట్టలేక అట్టర్ ఫ్లాప్ అయింది.

జీరో కలెక్షన్స్ మూవీ...:అయితే బ్రీత్ సినిమా బాక్సాఫీస్ వద్ద జీరో కలెక్షన్స్ రాబట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు మొదటి రోజు సైతం ఏ ఒక్క టికెట్ బుక్ అవ్వలేదని సమాచారం. ఇక మొదటి రోజే ఈసినిమాను ఎత్తేశారని తెలుస్తోంది. దానికి తోడు ఈ సినిమా యానిమ‌ల్‌, హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డీనరి సినిమాలకు పోటీగా వచ్చింది. ఇక అందరూ వీటికి ఆసక్తి చూపడంతో.. బ్రీత్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది.

ఆహా అనౌన్స్...:బాక్సాఫీస్ వద్ద తెలుగు ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోని ఈ మూవీ ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ థ్రిల్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మహా శివరాత్రి కానుకగా మార్చి 8 నుంచి బ్రీత్ సినిమాను ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఆహా తన సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది.

ఇక బ్రీత్ సినిమా కథ విషయానికొస్తే... :రాష్ట్ర సీఎం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆస్పత్రి పాలవుతాడు. సీఎంను చంప‌డానికి కొంతమంది ప్రయత్నిస్తుండగా.. అతన్ని కాపాడేందుకు ఓ సాధార‌ణ యువ‌కుడు ఏం చేశాడు.. ఎలా ముఖ్యమంత్రిని కాపాడాడు.. అసలు ముఖ్యమంత్రికి అతనికి సంబందం ఏంటిది అనేదే బ్రీత్ మూవీ. మరి థియేటర్లలో జీరో కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X