Devil OTT: ఓటీటీలోకి వచ్చేసిన డెవిల్.. నందమూరి ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఏంటంటే!

బడా ఫిల్మ్ బ్యాగ్రౌండ్‌తో సినిమా కెరీర్‌కు మొదలు పెట్టినా.. అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు నందమూరి చిన్నోడు కల్యాణ్ రామ్. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో 'డెవిల్' అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీని చేశాడు.

Nandamuri Kalyan Ram Starrer Devil Movie OTT Streaming Started on Amazon Prime

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'డెవిల్'. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని డిసెంబర్ 29వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా ఈ మూవీ నష్టాలతోనే రన్‌ను ముగించింది.

'డెవిల్' మూవీపై ఆరంభం నుంచీ అంచనాలు నెలకొనడంతో.. దీని డిజిటల్ రైట్స్‌కు భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. తీవ్ర డిమాండ్ నడుమ ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందులో సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలిసింది. ఇది కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అని ట్రేడ్ వర్గాల టాక్.

Nandamuri Kalyan Ram Starrer Devil Movie OTT Streaming Started on Amazon Prime

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని ఓ న్యూస్ ప్రచారం అయింది. అలాంటిది ఈ చిత్రం నెల కూడా కాకముందే అంటే జనవరి 14వ తేదీ అర్ధరాత్రి నుంచే ఆ ఓటీటీలో ప్రత్యక్షం అయిపోయింది.

అభిషేక్ నామా దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' మూవీని అమెజాన్ ప్రైమ్ పలు భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోంది. ఇందులో సెన్సార్‌లో కట్ అయిన సీన్స్‌ను, డైలాగులను కూడా యాడ్ చేశారని తెలిసింది. దీంతో సంక్రాంతికి తమ హీరోల సినిమాలు లేవని బాధపడుతున్న నందమూరి అభిమానులకు అసలైన సర్‌ప్రైజ్ వచ్చినట్లు అయింది.

Nandamuri Kalyan Ram Starrer Devil Movie OTT Streaming Started on Amazon Prime

ఇదిలా ఉండగా.. పిరియాడిక్ థ్రిల్లర్‌గా రూపొందిన 'డెవిల్' సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాంన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని ఇచ్చాడు. దీనిలో మాళవిక నాయర్, అజయ్, సత్య కీలక పాత్రలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X