OTT 9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన స్పెషల్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు వెంటనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా సడెన్ గా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ రచ్చ చేస్తున్నాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోల చిత్రాలు కూడా నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సూపర్ డూపర్ హిట్ సినిమా సలార్ కూడా ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఓ చిన్న సినిమా మాత్రం 9 నెలల కిందటే విడుదల అయినా ఓటీటీలోకి రాలేదు. అది అమెజాన్ ప్రైమ్ లో ఉన్నా ఇతర దేశాల్లో మాత్రమే చూసే వీలును కల్పించారు. ఆ సినిమా ఏంటి ప్రస్తుతం ఎందులో ఆ చిత్రాన్ని చూడచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నందిత శ్వేత ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ ఫిల్మ్ రారా పెనిమిటి. ఈ సినిమా గత ఏడాది అంటే 2023లో ఎప్రిల్ 9వ తేదీన విడుదల అయింది. శ్రీ విజ‌యానంద్ పిక్చ‌ర్స్ బ్యానర్‌పై ప్ర‌మీల గెద్దాడ‌ నిర్మించిన ఈ సినిమాకు స‌త్య వెంక‌ట గెద్దాడ దర్శకత్వం వహించారు. చిన్న సినిమా కావడంతో ఈ సినిమా థియేటర్ల వద్ద అంతగా సందడి చేయలేకపోయింది. నందిత శ్వేతతో పాటు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సునీల్, సప్తగిరి, హేమ, అన్నపూర్ణమ్మలు కూడా నటించి మెప్పించారు.

Nandita Swetha Special Movie Raa Raa Penimiti OTT Streaming Details

నందిత శ్వేత హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.. రామ్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. అలాగే నీలకంఠ రావు పాటలు రాయగా.. హరిణి ఇవటూరి పాటలు పాడారు. సినిమా టైటిల్ కు తగ్గట్లుగానే ఓ అందమైన భార్య.. తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రా రా పెనిమిటి అంటూ ప్రేమగా పిలుచుకుంటూ ఎదురు చూస్తుంది. అయితే చివరకు ఆమె భర్త ఇంటికి వచ్చాడా, లేదా అనేది ఈ సినిమాలు కథ. అయితే సూపర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా విడుదల అయి ఇప్పటికే తొమ్మిది నెలలు అవుతుంది.

కానీ ఇప్పటి వరకు ఈ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్నప్పటికీ ఇతర దేశాల వాళ్లు మాత్రమే చూసే వీలు కల్పించారు. కానీ తాజాగా ఈ సినిమా మరో రెండు ఓటీటీల్లో కూడా సందడి చేస్తోంది. హంగామా ప్లే, గ్యాలక్సీ ఓటీటీ అనే రెండు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమాను మీరు చూసి ఉండకపోతే ఓటీటీ వేధికగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూస్తూ మూవీ నైట్ ను ప్లాన్ చేసుకోండి. ఇంకా ఎందుకు ఆలస్యం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X