Devil Movie OTT: ఆ ప్రముఖ ఓటీటీలో డెవిల్ మూవీ.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?

ప్రయోగాత్మక కథలతో వచ్చే హీరోల్లో నందమూరి కల్యాణ్ రామ్ ఒకరు. ఆయన బింబిసార లాంటి హిట్ తర్వాత ప్రయోగాత్మకంగా తీసిన చిత్రం అమిగోస్. ఇక ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. కల్యాణ్ రామ్ ప్రయోగానికి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆయన నటించిన మరో ప్రయోగాత్మక చిత్రం డెవిల్. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొడుతున్న హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరని చెప్పాలి. తాజాగా ఆయన హీరోగా నటించిన 'డెవిల్' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకు మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ లభించింది. సోషల్ మీడియాలో 'డెవిల్' సినిమాపై ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఈ సినిమాతో కల్యాణ్ రామ్ హిట్ అందుకోవడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.

Nandmuri Kalyan Ram Devil Movie Digital And Satellite Details Here

ఇక 'డెవిల్' మూవీ ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ వివరాలు బయటకు వచ్చేశాయి. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుందని సమాచారం. అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే.. ముందుగానే ఈ సినిమాను అలా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఏ సినిమా అయిన విడుదల అయిన నెలలోపే ఓటీటీల్లో రిలీజ్ అవుతుంది.

అయితే డెవిల్ సినిమా మాత్రం ఓటీటీలో రావడానికి కాస్త టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. డెవిల్ చిత్రం విడుదల అయిన 45 రోజుల తర్వాత లేదా 60 రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుందట. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ సినిమాను ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఈటీవీ శాటిలైట్ రైట్స్ ను భారీ ధరకు విక్రయించింది. ఇక టెలికాస్ట్ కూడా ఓటీటీలో వచ్చాక.. చాలా సమయానికి చేయనున్నారని తెలుస్తోంది.

Nandmuri Kalyan Ram Devil Movie Digital And Satellite Details Here

ఇక ఈ సినిమాకు మొదటి నుంచి మంచి బజ్ నెలకొంది. విడుదలైన ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే డిటిజల్, శాటిలైట్ రైట్స్ భారీ ధరకే అమ్ముడు పోయినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీ విషయానికి వస్తే.. ఈ సినిమాలో కల్యాణ్ రామ సరసన సంయుక్త మీనన్ నటించింది. ఈ భామ బింబిసారలో నటించి.. కల్యాణ్ రామ్ మంచి హిట్ అందించింది. ఇప్పుడు కూడా ఈ భామ డెవిల్ లో నటించి.. కల్యాణ్ రామ్ కు లక్కీ హీరోయిన్ అయిపోయింది.

ప్రముఖ దర్శకుడు అభిషేక్ నామా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక ఈ మూవీలో సంయుక్త మీనన్‌తో పాటు మరో కీలక పాత్రలో మాళవికా నాయర్ నటించింది. ఇక కల్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా రికార్డు స్థాయిలో బిజినెస్ నమోదు చేసుకుందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 16.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని సమాచారం. ఈ సినిమా హిట్ కావాలంటే... రూ.17 కోట్లు రాబడితే చాలు. చూడాలి మరి ఏ రేంజులో కలెక్షన్స్ రాబడుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X