20 రోజులు కూడా కాకముందే OTTలోకి రాబోతున్న "డెవిల్".. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
నందమూరి కల్యాణ్ రామ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటతో అందరినీ ఆకట్టుకుంటూ... విభిన్నమైన కథలతో వస్తుంటాడీ యంగ్ అండ్ డైనమిక్ హీరో. అయితే ఈయన తాజాగా చేసిన చిత్రం డెవిల్. బింబిసార లాంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాలతో వచ్చిన ఆయన ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. అమిగోస్ కు మంచి మార్కులే వచ్చినప్పటికీ.. డెవిల్ కు మాత్రం ఆ టాక్ కూడా రాలేదు. డిసెంబర్ 29వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భారీ అంచనాల మధ్య డిసెంబర్ 29వ తేదీ నుంచి విడుదల అయిన ఈ సినిమా థియేటర్ల వద్ద ఎక్కువగా ఆడలేదు. ప్రముఖ దర్శకుడు అభిషేక్ నామా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. సంయుక్త మీనన్‌తో పాటు మరో కీలక పాత్రలో మాళవికా నాయర్ నటించింది. అలాగే శ్రీకాంత్ అయ్యంగర్, సత్య, అజయ్, ఎస్తర్ నోరాన్హా, ఎల్నా నొరౌజీలు ఈ చిత్రంలో నటించి మెప్పించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అనిభిష్ నామా ఈ సినిమాను నిర్మించారు. అలాగే హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా.... సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. అలాగే తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలను తీసుకున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్.. ముఖ్యంగా డైరెక్టర్ విషయంలో పలు వివాదాలు చోటు చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ ను 80 శాతం పూర్తి చేసిన నవీన్ మేడారంకు.. అభిషేక్ నామాకు మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలోనే 80 శాతం షూటింగ్ పూర్తయ్యాక అతడు వెళ్లిపోగా.. మిగిలిన 20 శాతం షూటంగ్ ను అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. అయితే సినిమా విడుదల అయిన తర్వాత ఈ చిత్రం ఎక్కువగా ఆడకపోవడంతో త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది.

పెద్ద సినిమాలు, ముఖ్యంగా స్టార్ హీరోలు చిత్రాలు.. హిట్ టాక్ వస్తే 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో విడుదల అవుతుంది. కానీ ఈ సినిమా ఎక్కువగా ఆడకపోవడంతో నెల తిరక్కుండానే ఓటీటీలో వచ్చేస్తోంది. డిసెంబర్ 29వ తేదీన విడుదల అయిన ఈ సినిమా జనవరి 14వ తేదీ నుంచే ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ఇంత త్వరగా ఓటీటీలో సందడి చేయబోతున్న కల్యాణ్ రామ్ సినిమాను రేపే ఫ్యామిలీతో కలిసి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











