Nijam With Smitha: రానాతో నాని సినిమా.. ఆ హీరోలపై కోపం.. పులి ఎక్కడున్న పులే అంటూ!

ప్రస్తుత కాలంలో డిజిటల్ తెరపై టాక్ షోల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఒకటి పూర్తయిన వెంటనే మరొ కొత్త టాక్ షో వచ్చి సందడి చేస్తోంది. నందమూరి నటసింహం బాలయ్య బాబు అదరగొట్టిన అన్ స్టాపబుల్ రెండో సీజన్ ముగిసిన మరుసటి రోజే సరికొత్త టాక్ షో ప్రారంభమైంది. ఇండియన్ పాప్ సింగర్ అండ్ బ్యూటిఫుల్ స్మిత హోస్ట్ చేస్తున్న నిజం విత్ స్మిత టాక్ షో ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఒక్కొక్క సెలబ్రిటీ పూర్తి ఎపిసోడ్ ను వారానికి ఒకసారి రిలీజ్ చేస్తున్నారు. అయితే తాజా ఎపిసోడ్ కు నేచురల్ స్టార్ నానితోపాటు దగ్గుబాటి రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతున్న కూడా నాని పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఒక ప్రోమో వదిలారు.

వారానికి ఒక్కో ఎపిసోడ్..

వారానికి ఒక్కో ఎపిసోడ్..

ఇండియన్ పాప్ సింగర్, స్టన్నింగ్ బ్యూటి స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'నిజం విత్ స్మిత' టాక్ షోకి సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు కూడా ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. వారిలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై పలు విశేషాలు పంచుకున్నారు. రాధికా శరత్ కుమార్, సినిమా హీరోలు నాని, రానా దగ్గుబాటి, అడవి శేష్, అల్లరి నరేష్, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాత స్వప్న ద్, డైరెక్టర్స్ దేవకట్ట, సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి ఎపిసోడ్స్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయింది. ప్రతివారం ఒక్కొక్కరి ఎపిసోడ్ ను విడుదల చేస్తున్నారు.

 ఇద్దరి పేర్లు టంగ్ ట్విస్ట్..

ఇద్దరి పేర్లు టంగ్ ట్విస్ట్..

ప్రస్తుతం నాని, దగ్గుబాటి రానా ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నేచురల్ స్టార్ నాని, రానా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఇదివరకే విడుదల చేయగా.. తాజాగా మరొక ప్రోమోను వదిలారు. ఈ ప్రోమోలో.. ఈ ఎపిసోడ్ పేరు వారసత్వం.. వారిసత్వం అని స్మిత చెప్పగానే రానా, నాని ఎంట్రీ ఇచ్చారు. తర్వాత రోల్ రైడా తన ర్యాప్ సాంగ్ తో ఆకట్టుకున్నాడు. రానా, నాని ఇద్దరు కూర్చున్నాకా.. మా నోటికి మీ ఇద్దరి పేర్లు టంగ్ ట్విస్టు అని స్మిత అంటే.. నాని.. రానా అంటూ ఫాస్ట్ గా నాని చెప్పాడు. కానీ రానా అలా చెప్పలేకపోయాడు. సరే ఇప్పుడు మీరు చేయండి అని రానా అంటే.. ఇప్పుడు నాకు గుర్తు లేదు అని స్మిత తప్పించుకుంది. దీంతో అంతా నవ్వులతో మునిగిపోయారు.

మరో డిఫరెంట్ అడవిలోకి..

ఎందుకు నాని నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందాడు అని స్మిత ప్రశ్నించింది. ఎందుకంటే మిగతా వారంతా అన్నాచురల్ అని చెప్పు అని రానా అన్నాడు. దీంతో స్మిత చాలా గట్టిగా నవ్వేసింది. టాలీవుడ్ అనేది ఒక అడవి.. బాలీవుడ్ అనే మరో డిఫరెంట్ అడవిలోకి వెళ్లి పడ్డావ్.. అని స్మిత అడిగితే.. పులి ఎప్పుడు పులే.. ఫారెస్ట్ మారింది కానీ, పులి మారదు అని రానా, నాని ఇద్దరూ కలిసి చెప్పారు. దీంతో షోలో అరుపులు వినిపించాయి.

ఇద్దరం కలిసి ఒకే ఫ్రేమ్ లో..

మీ ఇద్దరు కలిసి ఒక బాక్సులో (ఒక సినిమాలో) ఎప్పుడు కనిపిస్తారు అని స్మిత క్వశ్చన్ చేసింది. నాకు తెలిసి మేము ఇద్దరం కలిసి ఒకే ఫ్రేమ్ లో నటించే స్టోరీ ఉండకపోవచ్చు. మాకు అయితే యాపిల్ బాక్సులు ఇవ్వాల్సి వస్తది అని నాని అన్నాడు. దీంతో మరోసారి షోలో నవ్వులు విరసబూసాయి. ఇలా ఈ ప్రోమో ఆసక్తికరంగా సాగింది. నాని, రానా మూడో ఎపిసోడ్ ప్రస్తుతం సోనీ లివ్ లో ప్రసారం అవుతోంది.

హీరోల మీద కోపంతో..

హీరోల మీద కోపంతో..

ఇక అంతకుముందు ప్రోమోలో నెపోటిజంపై నాని షాకింగ్ కామెంట్స్ చేశాడు. నెపోటిజం గురించి మాట్లాడదాం అని స్మిత అంటే.. నువ్వు చెప్పు అని రానా అన్నాడు. దీంతో ఒడియమ్మ.. ఒక్క నిమిషం ఆగు.. దీని గురించి ఒక్కటే అర్థం చేసుకోవచ్చు అని నాని అంటే నీ కొడుకు అర్థం చేసుకుంటాడు అని రానా అన్నాడు. చాలా మంది హీరోలపై కోపంతో హీరో అయ్యానని రానా సరదాగా చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X