Ante Sundaraniki: ఓటీటీ అఫీషియల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంకాస్త ఆలస్యంగానే వస్తున్న నాని!
నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా నజ్రియా మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసింది. అయితే సినిమా విడుదల తర్వాత మాత్రం ఒక్కసారిగా నిరాశపరచడంతో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఫ్లాప్ సినిమాగా నిలిచిపోయింది.
అసలైతే ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఆ దుకుంటుంది అని నిర్మాతలు మంచి నమ్మకంతోనే సినిమాను గ్రాండ్గా విడుదల చేశారు. అయితే సినిమా కనీసం పెట్టిన పెట్టుబడిని కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. దాదాపు 8 నుంచి 9 కోట్ల మధ్యలో సినిమా థియేట్రికల్ గా నష్టాలను కలిగించినట్లు సమాచారం. ఇక ఓటీటీ ద్వారా అయితే కొంతవరకు నిర్మాతలు సేఫ్ జోన్ లోనే ఉన్నారు అని చెప్పవచ్చు.

అంటే సుందరనికి.. సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక అందులో ఎప్పుడు స్ట్రీమ్ అవుతుంది అనే విషయంలో గత కొంతకాలంగానే అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అసలైతే గత వారంలోనే నెట్ ఫ్లిక్స్ సినిమాను విడుదల చేయాలని చాలా ప్రయత్నాలు చేసింది. నిర్మాతలకు కొంత ఎక్కువ అమౌంట్ ఇచ్చి కూడా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మైత్రి వారు వీలైనంతవరకు ఎక్కువ రోజులు థియేటర్స్ లో సినిమాను ఉంచాలి అని ఆలోచించి ఓటీటీ ఆఫర్స్ కు టెంప్ట్ అవ్వలేదు.
మొన్నటి వరకు వినిపించిన టాక్ ప్రకారం అయితే ఈ సినిమాను జూలై 8వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నట్లు ఒక ప్రచారమైతే జరిగింది. దాదాపు అందరూ కూడా అదే నిజమని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కొద్దిసేపటికి అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు. జూలై 10వ తేదీన సినిమా రాబోతున్నట్లుగా ప్రత్యేకమైన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. సాధారణంగా కొన్ని సినిమాలు ముందుగా అనుకున్న డేట్ ప్రకారం కంటే కూడా ఇంకాస్త తొందరగా ఓటిటిలోకి వస్తూ ఉంటాయి. కానీ నాని సినిమా మాత్రం ఇంకాస్త ఆలస్యంగా ఓటీటీ లోకి రాబోతోంది. మరి ఓటీటీ లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











