Ante Sundaraniki: ఆ ఓటీటీలో నాని సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే!
బ్యాగ్రౌండ్ లేకున్నా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే అందులో కొందరు మాత్రమే భారీ స్థాయిలో సక్సెస్ అయ్యారు. అందులో సహజ సిద్ధమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నేచురల్ స్టార్ నాని ఒకడు. కెరీర్ ఆరంభించి తొలినాళ్లలోనే స్టార్‌డమ్‌ను అందుకున్న అతడు.. అక్కడి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. అదే సమయంలో ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. అయితే, 'జెర్సీ' తర్వాత నాని ఆ రేంజ్ హిట్‌ను మాత్రం చేరుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్'తో మరోసారి విజయాన్ని ఖాతాలో వేసుకోవడంతో పాటు సక్సెస్ బాట పట్టాడు.
నేచురల్ స్టార్ నాని తాజాగా 'అంటే.. సుందరానికీ!' అనే సినిమాను చేశాడు. పూర్తి స్థాయి వైవిధ్యమైన కథతో రూపొందిన ఈ సినిమాను 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' వంటి ఆసక్తికరమైన సినిమాలను తెరకెక్కించి.. ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వివేక్ ఆత్రేయ రూపొందించాడు. విడుదలకు ముందే ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అంతేకాదు, అందుకు అనుగుణంగానే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 30 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను కూడా జరుపుకుని ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.
వినూత్న కథాంశంతో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'అంటే.. సుందరానికీ!'కి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే దీనికి రివ్యూలు కూడా మంచిగా వచ్చాయి. దీనికి తగ్గట్లుగానే ప్రేక్షకులు మొదటి రోజు మంచి ఆదరణను అందించారు. ఫలితంగా ఈ సినిమాకు ఓపెనింగ్ డేన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 4 కోట్ల షేర్.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 6 కోట్ల వరకూ షేర్ దక్కింది. ఇది నాని కెరీర్‌లోని గత చిత్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువే అని చెప్పాలి. అయితే, రెండో రోజు నుంచి మాత్రం ఈ సినిమాకు ఆదరణ పెరిగింది. దీంతో ఈ వీకెండ్‌లో ఇంకాస్తా ఎక్కువగా వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

నేచురల్ స్టార్ నాని - నజ్రియా నజీమ్ జంటగా నటించిన 'అంటే.. సుందరానికీ!' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, దీనికి క్లారిటీ మాత్రం రావడం లేదు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఇందుకోసం సదరు సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు భారీ మొత్తాన్నే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను జూలై మొదటి వారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
నేచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'అంటే.. సుందరానికీ!'. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. వివేక్ సాగర్ దీనికి సంగీతం అందించాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











