Dasara OTT: నాని దసరా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా అన్ని కోట్లకు.. అందులో స్ట్రీమింగ్!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గతేడాది హీరోగా అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో అలరించిన విషయం తెలిసిందే. వీటి తర్వాత నిర్మాతగా హిట్ 2 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక 2023 సంవత్సరంలో నాని చేసిన మొదటి సినిమా దసరా.
మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియా చిత్రం: నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటించిన చిత్రం దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరు నిర్మించిన ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 30న పాన్ ఇండియా మూవీగా చాలా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేశారు.
రగ్గడ్ లుక్.. కీలక పాత్రలు: తెలంగాణలోని ఓ గ్రామం వీర్లపల్లి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ధరణిగా నాని రగ్గడ్ లుక్ లో కనిపించగా మరో హీరోగా దీక్షిత్ ఆకట్టుకున్నాడు. ఇక వెన్నెలగా డీ గ్లామర్ పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. వీరితోపాటు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, సముద్ర ఖని, సాయి కుమార్, ఝాన్సీ, జరీనా వాహెబ్ వంటి తదితరులు కీలక పాత్రలు పోషించగా.. సంతోష్ నారాయణ్ బీజీఎమ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

వచ్చిన కలెక్షన్స్: పంచవ్యాప్తంగా దాదాపుగా 2710కి పైగా థియేటర్లలో విడుదలైంది నాని దసరా చిత్రం. రిలీజ్ రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. మొదటి రోజున నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ట్రయాంగిల్ లవ్, ఫ్రెండ్‌షిప్ బ్యాక్ డ్రాప్ లో రియలిస్ట్ రివేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ రూ. 112కి కోట్ల గ్రాస్ అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది.
భారీ ధరకు: నాని తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చినట్లుగు విమర్శకల నుంచి సినీ ప్రముఖుల వరకు ప్రశంసలు కురిపించారు. బాక్సాఫిస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎంతోమంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. థియేటర్లలో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న దసరా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయింది.

సౌత్ లాంగ్వేజెస్ రైట్స్..: నాని దసరా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సుమారు రూ. 22 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం అందింది. తెలుగుతోపాటు సౌత్ భాషలకు సంబంధించిన హక్కులను దక్కించుకుంది. మే 30 నుంచి తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇక హిందీ వెర్షన్ కు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











