The Paradise OTT: ది ప్యారడైజ్ ఓటీటీ రైట్స్‌కు రికార్డ్ ప్రైజ్... నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్, ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్ నాని హీరోగా.. దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్. కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. నాని లుక్, గ్లింప్స్‌తో చిత్ర పరిశ్రమలో ది ప్యారడైజ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్ట్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ సహా 8 భాషల్లో ది ప్యారడైజ్‌ను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ది ప్యారడైజ్ ఓటీటీ డీల్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మరి నాని సినిమా డిజిటల్ రైట్స్‌ను ఏ కంపెనీ దక్కించుకుంది? ఎన్ని కోట్ల ధర పలికింది? ఈ వివరాల్లోకి వెళితే..
ది ప్యారడైజ్ తారాగణం
ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ది ప్యారడైజ్ సినిమాను దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాని సరసన సోనాలి కులకర్ణి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాఘవ్ జుయల్, బాబు మోహన్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ది ప్యారడైజ్‌కు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా.. సీహెచ్ సాయి సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. తోట శ్రీనివాస్ డైలాగ్ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ది ప్యారడైజ్ రిలీజ్ ఎప్పుడంటే?
ది ప్యారడైజ్‌లో నాని లుక్ కొత్తగా ఉంది. రెండు జడలు వేసుకుని డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు నేచురల్ స్టార్. ఈ ఏడాది మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ముందే ప్రకటించారు మేకర్స్. అయితే అదే రోజున పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుండటంతో ప్యారడైజ్ విడుదలపై ప్రేక్షకుల్లో కన్‌ఫ్యూజన్ నెలకొంది. మార్చి 26న పవన్‌ని నాని ఢీకొడతారా? లేక వెనక్కితగ్గి తమ సినిమాను మరో డేట్‌కి మార్చుకుంటారా? అంటూ చిత్ర పరిశ్రమలో భారీ చర్చ జరిగింది. దీనికి తగినట్లుగానే పవన్ కోసం నాని తన డేట్ త్యాగం చేసి.. 5 నెలలు ఆలస్యంగా థియేటర్‌లలోకి రానున్నాడు. అంతేకాదు.. ఇటీవల విడుదల చేయాలని అనుకున్న ది ప్యారడైజ్ టీజర్ రిలీజ్‌ను కూడా మేకర్స్ వాయిదా వేసినట్లుగా చిత్ర పరిశ్రమలో వార్తలు వస్తున్నాయి
ది ప్యారడైజ్ నుంచి సర్‌ప్రైజ్
2026లో భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ది ప్యారడైజ్ కూడా చోటు దక్కించుకుంది. ఏకంగా యష్ నటించిన టాక్సిక్, రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2లకు పోటీ ఇస్తూ ఐఎండీబీ లిస్ట్‌లో దూసుకొస్తోంది. ఈ హైప్‌ను మరింత పెంచేందుకు రానున్న పండగల సందర్భంగా ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీనికి తోడు సినిమా కూడా ఏకంగా 5 నెలల పాటు వాయిదా పడటంతో అభిమానుల బాధ పొగొట్టేందుకు ఏదో ఒకటి చేయాలని యోచిస్తున్నారు.
ది ప్యారడైజ్ ఓటీటీకి రికార్డ్ ధర
చిత్ర పరిశ్రమలో భారీ అంచనాల నేపథ్యంలో ది ప్యారడైజ్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బడా కంపెనీలు క్యూకడుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, హిందీ, ఓవర్సీస్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ ఆఫర్లతో రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడే తొందరపడకూడదని నిర్మాతలు భావిస్తున్నారట. ఇదే సమయంలో ది ప్యారడైజ్ డిజిటల్ రైట్స్‌కు సంబంధించి డీల్ క్లోజ్ చేసినట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాని మూవీ ఓటీటీ రైట్స్ కోసం పలు కంపెనీలు పోటీలో నిలిచినప్పటికీ.. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 58 కోట్ల రూపాయలు వెచ్చించి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నాని సినిమాల ఓటీటీ రైట్స్‌కు సంబంధించి ఇదే అత్యధికం. నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా మూవీ ఓటీటీ రైట్స్ ధర 30 కోట్లు కాగా.. ఈసారి ది ప్యారడైజ్‌కి ఏకంగా 58 కోట్ల రూపాయల బిజినెస్ జరగడం గమనార్హం. అయితే నెట్‌ఫ్లిక్స్‌తో డీల్‌కు సంబంధించి మేకర్స్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











