Dasara OTT: దసరా నుంచి మరో సర్‌ప్రైజ్.. ఆ వెర్షన్ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్

సహజ సిద్ధమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ నేచురల్ స్టార్ అన్న పేరును సార్థకం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నాడు టాలెంటెడ్ హీరో నాని. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసే అతడు.. 'శ్యామ్ సింగా రాయ్'తో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత 'అంటే.. సుందరానికీ'తో నిరాశను ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని పట్టుదలతో కనిపించాడు. ఇందులో భాగంగానే ఇటీవలే నాని 'దసరా' అనే ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

న్యూ కమర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నాని చేసిన సినిమానే 'దసరా'. పాన్ ఇండియా చిత్రం కావడంతో దీదీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం హవాను చూపిస్తూ వచ్చింది. దీంతో ఫుల్ రన్‌లో ఈ మూవీ అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 65 కోట్లు వరకూ షేర్‌తో పాటు రూ. 116 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా నిర్మాతలకు రూ. 16 కోట్లు వరకూ లాభాలు వచ్చాయి. పాన్ ఇండియా రేంజ్‌లో అన్ని భాషల్లోనూ ఇది హిట్ అవడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది.

Nani Starrer Dasara Movie Hindi Version Streaming on Netflix From May 25th

మాస్ యాక్షన్‌తో వచ్చిన 'దసరా' మూవీ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వెర్షన్ల స్ట్రీమింగ్ గత నెలలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రారంభ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ హిందీ వెర్షన్ ఎప్పుడు వస్తుందా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ హక్కులను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ దీనిపై ప్రకటన చేసింది. అందులో ఈ సినిమా హిందీ వెర్షన్‌ను మే 25 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నార్త్ ఇండియాలో ఉన్న నాని అభిమానులు తెగ సంతోష పడుతున్నారు.

నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'దసరా' సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X