Dasara OTT: రెండు ఓటీటీల్లో దసరా స్ట్రీమింగ్.. తెలుగు వెర్షన్ అందులోనే.. ఎప్పుడు రాబోతుందో తెలిస్తే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. ఎన్నో విజయాలను సైతం దక్కించుకున్నాడు.
అయితే, అతడి గత చిత్రం 'అంటే.. సుందరానికీ' ఆశించిన రీతిలో ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలన్న పట్టుదలతో 'దసరా' అనే ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీని చేశాడు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆసక్తికర సమాచారం తెలిసింది. ఆ వివరాలు మీకోసమే!

దసరా అంటూ వచ్చిన నాని
నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

బిగ్గెస్ట్ రిలీజ్.. నాని సందడి
తెలంగాణలోని సింగరేణి ఏరియా కథతో రూపొందిన 'దసరా' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా చిత్రం కావడంతో దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2710కి పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. దీంతో అంతటా నేచురల్ స్టార్ నాని సందడే నెలకొంది.

అలాంటి టాక్.. యూఎస్‌లో
నాని - కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన 'దసరా' మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా యూఎస్‌లో నాని సినిమా దుమ్ముదులుపుతోంది. ప్రీమియర్స్ ద్వారానే ఇది 600K డాలర్ల వరకూ వసూలు చేసి ఎన్నో రికార్డులను నమోదు చేసింది.

ఓపెనింగ్స్ కూడా భారీగానే
నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ లభించింది. దీనికితోడు ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీగానే దక్కుతోంది. దీంతో మొదటి రోజు షోలు దాదాపుగా ఫుల్ అయిపోయాయి. ఈ లెక్కన చూసుకుంటే టాలీవుడ్‌లోని టాప్ స్టార్ హీరోల రేంజ్‌లో మొదటి రోజు కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

నాని సినిమా ఆ ఓటీటీలోనే
టాలెంటెడ్ హీరో నాని - న్యూ కమర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన 'దసరా' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వెర్షన్ల స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది.

హిందీ వెర్షన్ మాత్రం వేరే
సాధారణంగా స్టార్ హీరోల భారీ చిత్రాలు మాత్రమే రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవడం చూస్తుంటాం. అయితే, ఇప్పుడు టాలీవుడ్‌లో టైర్ 2 హీరోగా ఉన్న నాని నటించిన 'దసరా' కూడా రెండు ఓటీటీ పార్ట్‌నర్స్‌ను దక్కించుకుంది. దక్షిణాది భాషల రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. 'దసరా' హిందీ వెర్షన్ హక్కులను మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది.

అప్పటి నుంచే స్ట్రీమింగ్
శ్రీరామనవమి కానుకగా మార్చి 30వ తేదీన 'దసరా' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇంకా ఇది ఒకరోజు కూడా పూర్తి చేసుకోకముందే ఓటీటీ స్ట్రీమింగ్ గురించి కీలక సమాచారం లీకైంది. దీని ప్రకారం.. నాని నటించిన ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వచ్చిన యాభై రోజుల తర్వాత అంటే మే మూడో వారం నుంచి స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











