Dasara OTT: దసరా ఓటీటీ డేట్ ప్రకటన.. ఆ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో సహజసిద్ధమైన నటనతో పక్కింటి అబ్బాయి అన్న ఇమేజ్‌ను సొంతం చేసుకుని ప్రేక్షకులకు మరింత చేరువ అయిపోయాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభం నుంచీ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న సినిమాల్లోనే నటిస్తోన్న అతడు.. ఎప్పటికప్పుడు పరిణితిని పొందుతూనే ఉన్నాడు.

అదే సమయంలో చాలా విజయాలను సైతం ఖాతాలో వేసుకుంటోన్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నాని 'దసరా' అనే ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

Nani Starrer Dasara Movie to Streaming on Netflix From April 27th

నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన 'దసరా' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా చిత్రం కావడంతో దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2710కి పైగా థియేటర్లలో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది.

దీంతో ఈ చిత్రానికి రికార్డు ఓపెనింగ్స్ దక్కాయి. ఇలా ఈ చిత్రం హవాను చూపిస్తూ వచ్చింది. దీంతో మూడు వారాల్లోనే ఇది రూ. 64 కోట్లు వరకూ షేర్‌తో పాటు రూ. 115 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా నిర్మాతలకు రూ. 15 కోట్లు వరకూ లాభాలు దక్కాయి.

ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'దసరా' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వెర్షన్ల స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది.

Nani Starrer Dasara Movie to Streaming on Netflix From April 27th

ఇక, ఈ సినిమాను సదరు సంస్థ ఏప్రిల్ 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతుంది. ఈ మేరకు తాజాగా నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇక, ఈ సినిమా హిందీ వెర్షన్‌ను మాత్రం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆ తేదీపై ప్రకటన రావాల్సి ఉంది.

నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన పక్కా మాస్ మసాలా మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X