Dasara OTT: ఓటీటీలోకి వచ్చిన దసరా మూవీ.. ఆ సీన్స్ కూడా యాడ్ చేసి మరీ!

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా గుర్తింపును తెచ్చుకుని.. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలను చేసుకుంటూ దూసుకుపోతోన్నాడు నాని. ఆ మధ్య 'శ్యామ్ సింగా రాయ్'తో భారీ హిట్ కొట్టిన అతడు.. ఆ తర్వాత 'అంటే.. సుందరానికీ'తో నిరాశను ఎదుర్కొన్నాడు.

దీంతో ఈ సారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం మరో ప్రయోగం చేయాలిని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే ఇటీవలే నాని 'దసరా' అనే ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Nani Starrer Dasara Movie to Streaming Started on Netflix

శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడితో నాని చేసిన సినిమానే 'దసరా'. పాన్ ఇండియా చిత్రం కావడంతో దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో దాదాపు 2710కి పైగా థియేటర్లలో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది.

దీంతో ఈ చిత్రానికి రికార్డు ఓపెనింగ్స్ దక్కాయి. ఇలా ఈ చిత్రం హవాను చూపిస్తూ వచ్చింది. దీంతో ఫుల్ రన్‌లో ఈ మూవీ అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 65 కోట్లు వరకూ షేర్‌తో పాటు రూ. 116 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా నిర్మాతలకు రూ. 16 కోట్లు వరకూ లాభాలు వచ్చాయి.

మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'దసరా' మూవీపై అంచనాలు భారీగా ఉండడంతో.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వెర్షన్ల స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది.

Nani Starrer Dasara Movie to Streaming Started on Netflix

ఇక, ఈ సినిమాను సదరు సంస్థ నేటి నుంచి స్ట్రీమింగ్ చేస్తుంది. ఇందులో సెన్సార్ బోర్డ్ కట్ చేసిన సీన్స్‌తో పాటు కొన్ని మ్యూట్ చేసిన డైలాగులను కూడా యాడ్ చేశారని తెలిసింది. ఇక, ఈ చిత్రం హిందీ వెర్షన్ మాత్రం హాట్‌స్టార్‌గా స్ట్రీమింగ్ కాబోతుంది.

నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'దసరా' సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X