Hi Nanna OTT: హాయ్ నాన్న ఓటీటీ డేట్ ఫిక్స్.. అనుకున్న దానికంటే లేటుగానే!

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో మాయ చేసే హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో కొందరు మాత్రమే ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చేస్తున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఈ ఏడాది ఆరంభంలోనే 'దసరా'తో సెన్సేషనల్ హిట్‌ను సొంతం చేసుకున్న అతడు... ఇటీవలే 'హాయ్ నాన్న' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

శౌర్యూవ్ దర్శకత్వంలో నాని నటించిన 'హాయ్ నాన్న' మూవీకి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. ఇదే అన్ని ఏరియాల్లోనూ కనిపించింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా లభిస్తోంది. మూడో వారంలోనూ అన్ని చోట్లా ఈ సినిమా షోలకు బుకింగ్స్ పెరుగుతున్నాయి. దీంతో ఈ సినిమా భారీ లాభాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

Nani Starrer Hi Nanna Movie OTT Streaming on Netflix From January 12th

'హాయ్ నాన్న' సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాతనే స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు సదరు సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు.

డిసెంబర్ 7వ తేదీన విడుదలైన 'హాయ్ నాన్న' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే, ఇప్పటికి కూడా ఈ సినిమా రన్ బాగానే ఉన్న నేపథ్యంలో మరో వారం రోజులు లేటుగా దీన్ని స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు నెట్‌ఫ్లిక్స్ సంస్థకు రిక్వెస్ట్ చేశారని తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

Nani Starrer Hi Nanna Movie OTT Streaming on Netflix From January 12th

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నేచురల్ స్టార్ నాని నటించిన 'హాయ్ నాన్న' మూవీని జనవరి 12వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకు రావాలని నెట్‌ఫ్లిక్స్ సంస్థ డిసైడ్ అయినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. నాని - శౌర్యూవ్ కలిసి చేసిన 'హాయ్ నాన్న' మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా నాని కూతురి పాత్రను పోషించింది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X