Hi Nanna OTT: హాయ్ నాన్న ఓటీటీ డేట్ వచ్చేసింది.. నెల కాకుండానే బిగ్ సర్‌ప్రైజ్

సహజసిద్ధమైన నటనతో పాటు పక్కింటి కుర్రాడిలా కనిపించే లుక్స్‌తో చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరోనే నేచురల్ స్టార్ నాని. సినిమా సినిమాకూ తన స్థాయిని పెంచుకుంటోన్న అతడు.. కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తున్నాడు. దీనికితోడు 'దసరా'తో భారీ హిట్‌ను అందుకుని ఇటీవలే 'హాయ్ నాన్న' అంటూ వచ్చాడు.

నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యూవ్ తెరకెక్కించిన సినిమానే 'హాయ్ నాన్న'. ఈ మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే రెస్పాన్స్ భారీగా రావడంతో కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమా దుమ్ము దులిపేసింది. ఇలా మూడు వారాల పాటు ఈ చిత్రం రాణించి హిట్ స్టేటస్‌తో పాటు లాభాలను కూడా అందుకుంది.

Nani Starrer Hi Nanna Movie OTT Streaming on Netflix From January 4th

ఫీల్ గుడ్ స్టోరీతో రూపొందిన 'హాయ్ నాన్న' సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను తీసుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని కూడా చెల్లించినట్లు తెలిసింది. అలాగే, దీన్ని నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా డీల్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Nani Starrer Hi Nanna Movie OTT Streaming on Netflix From January 4th

'హాయ్ నాన్న' మూవీ డిసెంబర్ 7వ తేదీన విడుదల అవగా.. దీని ఓటీటీ స్ట్రీమింగ్ నెల తర్వాతనే ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్నో డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా వెల్లడించింది. దీని ప్రకారం.. ఈ మూవీని జనవరి 4వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకు రాబోతుంది.

తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ 'హాయ్ నాన్న' డిజిటల్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించడంతో పాటు దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వెల్లడించింది. దీంతో నాని అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Nani Starrer Hi Nanna Movie OTT Streaming on Netflix From January 4th

ఇదిలా ఉండగా.. నాని - శౌర్యూవ్ కాంబోలో రూపొందిన 'హాయ్ నాన్న' మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా నాని కూతురి పాత్రను పోషించింది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X