నాని ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. ముందుగానే ఓటీటీలోకి సరిపోదా శనివారం
టాలీవుడ్‌లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని స్టార్లుగా మారిపోతున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. సుదీర్ఘ కాలంగా తెలుగు సినిమాలో తనదైన మార్కును చూపిస్తోన్న అతడు.. వరుసగా హిట్లను కూడా అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో ముందుకు సాగుతున్నాడు.
వరుసగా 'దసరా', 'హాయ్ నాన్న' వంటి హిట్లను అందుకుని ఫుల్ ఫామ్‌లో ఉన్న నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' అనే సినిమాను చేశాడు. 'అంటే సుందరానికీ' మూవీ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడగా.. అందుకు తగ్గట్లే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీశారు.

డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'సరిపోదా శనివారం' సినిమాను ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ చిత్రానికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ లభించింది. అందుకు తగ్గట్లుగానే దీనికి మంచి స్పందన కూడా వచ్చింది. దీంతో ఈ చిత్రానికి అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. ఫలితంగా ఇది హిట్ స్టేటస్‌తో పాటు లాభాలు సాధించింది.
'సరిపోదా శనివారం' సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్లుగానే ఈ మూవీ ప్రచార చిత్రాలు అదరగొట్టేశాయి. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ తీసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని కూడా నిర్మాతలకు ముట్టజెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇక, తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్‌పై తాజాగా ఓ న్యూస్ లీకైంది.

నాని హీరోగా నటించిన 'సరిపోదా శనివారం' సినిమాను నెల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ డిసైడ్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ, సెప్టెంబర్ 27న ఇది స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నారట. దీనిపై త్వరలోనే ప్రకటన రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. నాని - వివేక్ ఆత్రేయ కలిసి చేసిన 'సరిపోదా శనివారం' మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ కీలక పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











