Saripodha Sanivaaram: ఆ ఓటీటీలోనే సరిపోదా శనివారం.. ఎన్ని రోజులకు వస్తుందంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే తమదైన నేచురల్ యాక్టింగ్ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. అందులోనూ కొందరు హీరోలు ప్రతి చిత్రాన్ని తమ నటనతో నడుపుతున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఇటీవలి కాలంలో వరుసగా హిట్లను కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. ఇప్పుడు 'సరిపోదా శనివారం' అనే సినిమా చేశాడు.

'దసరా', 'హాయ్ నాన్న' వంటి హిట్లను అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్న నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' అనే సినిమాను చేశాడు. 'అంటే సుందరానికీ' మూవీ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడగా.. అందుకు తగ్గట్లే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

Nani Starrer Saripodha Sanivaaram Movie OTT Partner and Streaming Date Details

ఫుల్ లెంగ్త్ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'సరిపోదా శనివారం' సినిమాను ఆగస్టు 29వ తేదీన అంటే నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ చిత్రానికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ లభించింది. అందుకు అనుగుణంగానే దీనికి మంచి స్పందన కూడా లభిస్తోంది. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా భారీగానే లభించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.

'సరిపోదా శనివారం' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో మొదలైపోగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ తీసుకుంది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని కూడా నిర్మాతలకు ముట్టజెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

Nani Starrer Saripodha Sanivaaram Movie OTT Partner and Streaming Date Details

నాని హీరోగా నటించిన 'సరిపోదా శనివారం' సినిమాను థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తెలిసింది. అంటే ఆగస్టు 29వ తేదీన విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందిన 'సరిపోదా శనివారం' మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X