సరిపోదా శనివారం ఓటీటీ డేట్ వచ్చేసింది.. నాని ఫ్యాన్స్‌కు అసలు సర్‌ప్రైజ్ ఏంటంటే!

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన నటన, ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ టైమింగ్, డ్యాన్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇలా సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తోన్న అతడు.. వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడు. దీంతో ఫుల్లుగా మూవీలు చేస్తున్నాడు.

యమా ఫామ్‌లో ఉన్న నేచురల్ స్టార్ నాని ఇటీవలే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. 'అంటే సుందరానికీ' మూవీ నిరాశ పరిచిన తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఆ తర్వాత ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకోవడంతో దీన్ని గ్రాండ్‌గా తీసుకు వచ్చారు.

Nani Starrer Saripodha Sanivaaram Movie OTT Streaming Date Announced

డిఫరెంట్ కాన్సెప్టుతో పాటు క్రేజీ యాక్షన్‌తో రూపొందిన 'సరిపోదా శనివారం' సినిమాను ఆగస్టు 29వ తేదీన విడుదల చేశారు. అందరూ అనుకున్నట్లుగానే ఈ చిత్రానికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా లభించింది. దీంతో ఈ చిత్రానికి అదిరిపోయే వసూళ్లు వచ్చి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

'సరిపోదా శనివారం' సినిమాపై హైప్ విపరీతంగా క్రియేట్ అయింది. దీంతో ఈ సినిమా హక్కుల కోసం డిమాండ్ వచ్చింది. ముఖ్యంగా ఓటీటీ రైట్స్ కోసం భారీ పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో నెట్‌ఫ్లిక్స్ సంస్థ వీటిని సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని కూడా నిర్మాతలకు ముట్టజెప్పింది. ఇక, తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు.

Nani Starrer Saripodha Sanivaaram Movie OTT Streaming Date Announced

నాని హీరోగా చేసిన 'సరిపోదా శనివారం' సినిమాను నెల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని మొదట టాక్ వచ్చింది. తర్వాత నెల లోపే ఇది వచ్చేస్తుందని అన్నారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను సెప్టెంబర్ 26 నుంచే నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతుంది. దీన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి తెస్తున్నట్లు సదరు సంస్థ ప్రకటిస్తూ సర్‌ప్రైజ్ చేసింది.

Nani Starrer Saripodha Sanivaaram Movie OTT Streaming Date Announced

ఇదిలా ఉండగా.. నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందిన 'సరిపోదా శనివారం' మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X