బాబుకు భయం, ఎవరినీ నమ్మరు.. ఫేవరెట్ హీరోయిన్.. చంద్రబాబు నాయుడు ఆన్సర్ ఏంటంటే?
ఇటీవల ఓటీటీల హవా పెరగడంతో టాక్ షోలు విపరీతంగా పెరిగాయి. అంతేకాకుండా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. అయితే ఇప్పటికే తెలుగులో అనేకమైన టాక్ షోలు వచ్చాయి. సుమారు 15 ఏళ్ల క్రితం నుంచే తెలుగులో వివిధ టాక్ షోలు సందడి చేశాయి. అందులో కొన్ని మాత్రమే మంచి పేరు తెచ్చుకోగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ కు ఊహించని క్రేజ్ వచ్చింది. ఈ టాక్ షో రెండో సీజన్ పూర్తి అయిన మరుసటి రోజు నుంచే ఓటీటీ వేదికపై మరో టాక్ షో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. పాపులర్ సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తోన్న 'నిజం విత్ స్మిత' షోకి ఇటీవల చిరంజీవి రాగా రెండో అతిథిగా నారా చంద్రబాబు నాయుడు రానున్నారు.
ఇండియన్ పాప్ సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'నిజం విత్ స్మిత' టాక్ షోకి సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు కూడా ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు రాధికా శరత్ కుమార్, సినిమా హీరోలు నాని, రానా దగ్గుబాటి, అడవి శేష్, అల్లరి నరేష్, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాత స్వప్న ద్, డైరెక్టర్స్ దేవకట్ట, సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో మొదటి అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై ఆయన జీవితంలోని అనేక విషయాలను పంచుకున్నారు. పర్సనల్, ఫ్యామిలీ, రాజకీయం వంటి తదితర ఆసక్తికర విషయాలు తెలిపారు.

'నిజం విత్ స్మిత' టాక్ షోకి రెండో ముఖ్య అతిథిగా ప్రముఖ రాజకీయవేత్త, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఆయన రాజకీయంగా ఎదుర్కున్న ఒడిదొడుకులు, పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు అందరి గెస్టులతో విడుదల చేసిన ప్రోమోలో 'మాటకు ముందు తర్వాత వెన్నుపోటు వెన్నుపోటు' అంటారు అని స్మిత అంటే.. 'తెలంగాణ సీఎం కూడా భాగస్వామే. అందరం ఉన్నాం' అని చంద్రబాబు ఆన్సర్ ఇచ్చారు. అయితే అది వేరే ప్రశ్నకు సమాధానంగా అర్థం అయింది. ఇక చిరంజీవి తర్వాత అతిథిగా రాబోతున్న చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
తాజా ప్రోమోలో "ప్రతి ఒక్క ఫెయిల్యూర్ నీకు ఒక లెస్సన్ ఇస్తుంది. ప్రతి సంక్షోభం ఒక అవకాశం. ఏ రాష్ట్రమైనా.. ఏ దేశమైనా.. ఏ కంపెనీ అయినా.. ఏ ఫ్యామిలీ అయినా.. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ (కుటుంబ పెద్ద) ప్రాపర్ గా ఆలోచిస్తే ఏదైనా సాధ్యమే" అని చంద్రబాబు చెప్పారు. తర్వాత "బాబు గారికి భయం ఎక్కువ.. ఎవరినీ నమ్మరు" అని స్మిత అడిగారు. అప్పుడు చంద్రబాబు ఏదో చెబుతుంటే సస్పెన్స్ మ్యూజిక్ ఇచ్చి క్యూరియాసిటీ పెంచారు. 'మీ ఫేవరెట్ నటి ఎవరు' అని అడిగితే.. చంద్రబాబు నవ్వుతూ చెప్పారు. అయితే ఆమె ఎవరనేది రివీల్ చేయలేదు. కానీ చంద్రబాబు ఆన్సర్ విని స్మితతోపాటు ప్రేక్షకులు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. అనంతరం 'అత్యంత బాధకరమైన సంఘటన' గురించి చెప్పమని స్మిత ప్రశ్నతో ప్రోమో ముగించారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమైన ఈ షో రెండో ఎపిసోడ్ ను శుక్రవారం అంటే ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











