OTT: ఓటీటీలోకి ప్రతినిధి 2.. పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణమైన నటనతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో నారా రోహిత్ ఒకడు. ఆరంభం నుంచే డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే నారా రోహిత్ ఇటీవలే 'ప్రతినిధి 2' అనే సినిమాను చేసిన విషయం తెలిసిందే.
టాలెంటెడ్ గాయ్ నారా రోహిత్ హీరోగా నటించిన మెసేజ్ మూవీనే 'ప్రతినిధి 2'. మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన ఈ సినిమా గతంలో వచ్చిన 'ప్రతినిధి'కి సీక్వెల్‌గా రూపొందింది. ఇందులో ఎన్నో పొలిటికల్ థ్రిల్లింగ్ సీన్స్‌ను పెట్టారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే మొదటి పార్టు కంటే హై రేంజ్‌లో ఈ సినిమాను రూపొందించారు.

పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'ప్రతినిధి 2' ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే మొదటి వీకెండ్‌లో ఇది తక్కువ వసూళ్లనే రాబట్టింది. తర్వాత కూడా ఈ చిత్రం ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఫలితంగా తక్కువ సమయంలోనే డల్ కలెక్షన్లతో రన్‌ను ముగించుకోవాల్సి వచ్చింది. దీంతో హిట్ కోసం చూసిన రోహిత్‌కు నిరాశే ఎదురైంది.
నారా రోహిత్ హీరోగా.. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన సినిమా కావడంతో 'ప్రతినిధి 2'పై అందరిలోనూ ఆసక్తి వచ్చింది. కానీ, ఇది థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోయింది. దీంతో వీలైనంత త్వరగానే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇది ఇప్పటి వరకూ స్ట్రీమింగ్‌కు నోచుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఓ అప్‌డేట్ వచ్చింది.

ఏపీ ఎన్నికల టైంలో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన 'ప్రతినిధి 2' సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఆహా సంస్థ సొంతం చేసుకుంది. అంతేకాదు, దీన్ని సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ తాజాగా ప్రకటించింది. ఇక, ఇందులో సెన్సార్‌లో కట్ అయిన చాలా కాంట్రవర్శీ సీన్లు కూడా ఉంటాయని తెలిసింది.
ఇదిలా ఉండగా.. నారా రోహిత్ - జర్నలిస్ట్ మూర్తి కాంబోలో రూపొందిన 'ప్రతినిధి 2' సినిమాను వానర ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్‌లు నిర్మించారు. ఇందులో ఉదయభాను, సచిన్ ఖేడ్కర్, రఘుబాబు, జిస్సూ సేన్‌గుప్తాలు నటించారు. దీనికి మహతీ స్వర సాగర్ మ్యూజిక్ అందించాడు.


Click it and Unblock the Notifications











