Mentoo OTT: ఓటీటీలోకి మెన్ టూ మూవీ.. నెల కాకముందే రిలీజ్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. సినిమాను చూసే విధానంలో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఒకప్పుడు ఉన్న లెక్కలు ఇప్పుడు లేవు. ప్రస్తుతం సినిమాల్లో కంటెంట్ ఉంటేనే అది చిన్న మూవీ అయినా పెద్ద చిత్రమైనా థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. లేకుంటే వాటిని ఓటీటీల్లోనే చూసేందుకు ఇష్టపడుతున్నారు.

థియేటర్లలో హిట్ అయినా సినిమాలను కూడా ఓటీటీల్లో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆడియెన్స్ అభిరుచికి తగినట్లే విడుదలైన కొద్ది రోజుల్లోనే డిజిటల్ తెరపై ప్రసారం చేస్తున్నారు మేకర్స్. అలా తాజాగా ఓటీటీలోకి వస్తున్న సినిమానే #మెన్ టూ.

Naresh Agastya Riya Suman MenToo OTT Rights To Aha

మత్తు వదలరా, సేనాపతి ఫేమ్ నరేష్ అగస్త్య నటించిన తాజా చిత్రం '#మెన్ టూ' (#MenToo). ఇందులో హీరోయిన్ గా మజ్ను, పేపర్ బాయ్, టాప్ గేర్ ఫేమ్ రియా సుమన్ చేసింది. లాన్ థ్రేన్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మౌర్య సిద్ధవరం నిర్మించిన ఈ మూవీకి శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల అంటే మే 26న థియేటర్లలో విడుదలైంది. రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో విడుదలైన అతి కొద్దిరోజులకే ఓటీటీలోకి రావడంతో ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో నరేష్ ఆగస్త్యతోపాటు బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. పురుషుల కష్టాలు ఎలా ఉంటాయో చూపించే కథతో హాస్యం ప్రధానంగా ఈ మూవీ రూపొందింది. ఇందులో మెయిన్ రోల్స్ చేసిన అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష, సుదర్శన్ లు ఓ పబ్ లో రెగ్యులర్ గా కలుస్తుంటారు.

మహిళా బాధితులు అయినా వీరంతా తమ బాధలను ఒకరితో మరొకరు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో వీరిలో ఒకరు చనిపోతాడు. అసలు ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అనే తదితర అంశాలతో సినిమా సాగుతుంది.

సినిమా మొత్తం కామెడీగా నడిచిన చివర్లో ఎమోషన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాంటి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మెన్ టూ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఆహాలో (Aha) విడుదల చేయనున్నారు. జూన్ 9 నుంచి ఆహాలో మెన్ టూ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఎలిషా ప్రవీణ్ జి, ఓషో వెంకట్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X