Nari Nari Naduma Murari OTT: నారీ నారీ నడుమ మురారీకి అదిరిపోయే ఓటీటీ డీల్.. శర్వా మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nari Nari Naduma Murari OTT: సంక్రాంతి బరిలో నిలిచిన మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నారి నారి నడుమ మురారీ (Nari Nari Naduma Murari). యువ హీరో శర్వానంద్ హీరోగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నది. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆయన గత చిత్రాల్లో చూపిన లైట్ హార్టెడ్ ట్రీట్‌మెంట్, కామెడీ టైమింగ్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
"నారీ నారీ నడుమ మురారి" పూర్తిగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకుని రూపొందుతున్న రొమాంటిక్ కామెడీగా ప్రచారం పొందుతోంది. సంక్రాంతి రేసులో భారీ సినిమాల మధ్య ఈ సినిమా కూడా గట్టి పోటీ ఇవ్వబోతోందనే టాక్. ఈ నేపథ్యంలో మూవీ ఓటీటీ డీల్, అన్ లైన్ స్ట్రీమింగ్ వివరాల్లోకెళ్లే..

నారి నారి నడుమ మురారీ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించగా, యువ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సత్య, వీకే నరేష్, సుదర్శన్, సంపత్ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు నటించారు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాకు కథను భాను భోగవరపు అందించగా, నందు సావిరిగన డైలాగ్స్ రాశారు.
సినిమాటోగ్రఫీ బాధ్యతలను జ్ఞాన శేఖర్, యువరాజ్ నిర్వర్తించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు మరో ప్లస్‌గా నిలవనుంది. ఇద్దరు యువతుల మధ్య ఇరుక్కున్న యువకుడి కథాంశంతో రూపొందిన ఈ సినిమా, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నారీ నారీ నడుమ మురారి సినిమాపై విడుదలకు ముందే బిజినెస్ పరంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీ వర్గాల వివరాల ప్రకారం.. ఈ సినిమా కేవలం ఓటీటీ హక్కుల ద్వారానే సుమారు రూ.17.5 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ (Amazon Prime Video) సొంతం చేసుకుంది. థియేటర్లలో అడుగుపెట్టకముందే ఈ స్థాయి ఓటీటీ డీల్ క్లోజ్ కావడం సినిమాపై హైప్స్ పెరిగాయి.
ఇటీవల కాలంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలకు డిజిటల్ ప్లాట్‌ఫాంలలో మంచి డిమాండ్ ఉండటంతో, 'నారీ నారీ నడుమ మురారి'కి ఈ స్థాయి డీల్ దక్కిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఓటీటీతో పాటు శాటిలైట్, ఆడియో, ఇతర రైట్స్ కూడా మంచి ధరకు అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారా నిర్మాతలు కూడా సేఫ్ జోన్ ఉన్నట్టు టాక్.
ఇదిలా ఉండగా, థియేట్రికల్ రిలీజ్ లో పాజిటివ్ టాక్ రాయడంతో ఓటీటీ విషయంలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే అధికారికంగా ప్లాట్‌ఫామ్ పేరు ఇంకా ప్రకటించలేదు. సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ తర్వాత 6-8 వారాల గ్యాప్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ లెక్కన చూస్తే.. ఫిబ్రవరి చివరి వారంలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. సుమారు రూ.25 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా, సంక్రాంతి హాలిడే సీజన్ అడ్వాంటేజ్‌తో థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ శర్వానంద్‌కు ఉన్న ఫ్యాన్‌బేస్ ఈ సినిమాకు కలిసొచ్చే అంశం.


Click it and Unblock the Notifications











