AAY OTT: ఫేమస్ ఓటీటీలోనే ఆయ్ మూవీ.. ఎన్టీఆర్ బావమరిది సినిమా అప్పుడే వస్తుందా!

ఈ మధ్య కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీలకు చెందిన కుర్రాళ్లు వచ్చారు. అందులో కొందరు మాత్రమే బాగా హైలైట్ అయ్యారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఒకడు. 'మ్యాడ్' చిత్రంతో మంచి ఆరంభాన్ని అందుకున్న అతడు.. ఇప్పుడు 'ఆయ్' (AAY) అనే మూవీని చేశాడు.

ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంతో సాగే కామెడీ స్టోరీతో వచ్చింది. దీంతో ఈ చిత్రంపై హైప్ ఏర్పడింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందించారు. ఇలా ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేశారు.

Narne Nithiin Starrer AAY Movie Digital Streaming Details Revealed

ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఆయ్' మూవీని ఆగస్టు 15వ తేదీన విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మరో రెండు చిత్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ మొదటి రోజు మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్లను కూడా డీసెంట్‌గానే రాబట్టి సత్తాను చాటుకుంది.

డిఫరెంట్ స్టోరీతో రూపొందిన 'ఆయ్' సినిమా ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతుండగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను మంచి పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు తెలిసింది. ఇక, తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్‌పై ఓ న్యూస్ లీకైంది.

Narne Nithiin Starrer AAY Movie Digital Streaming Details Revealed

కడుపుబ్బా నవ్వించే కామెడీ స్టోరీతో వచ్చిన 'ఆయ్' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. అంటే ఆగస్టు 15వ తేదీన వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 3వ వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. పూర్తి స్థాయి ఫన్ స్టోరీతో తెరకెక్కిన 'ఆయ్' సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను చేశారు. ఈ మూవీకి రామ్ మిరియాల సంగీతాన్ని అందించాడు.

More from Filmibeat

Read more about: aay narne nithiin aay ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X