ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ మూవీ.. నాన్ స్టాప్‌గా నవ్వించే దీన్ని ఎలా చూడాలంటే!
తెలుగు సినిమా పరిశ్రమలో పక్కా పల్లెటూరి వాతావరణంతో ఫీల్ గుడ్ సినిమాలు చాలానే తెరకెక్కుతోన్నాయి. అయితే, అందులో చాలా వరకూ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు, హీరోలు అదే తరహా మూవీలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. అలా కొద్ది రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'ఆయ్' (AAY).
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమానే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంతో సాగే కామెడీ స్టోరీతో వచ్చేసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందించి.. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేశారు.

కడుపుబ్బా నవ్వించే కామెడీతో రూపొందిన 'ఆయ్' మూవీకి ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మరో రెండు చిత్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ మొదటి రోజు మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా కలెక్షన్లను భారీ స్థాయిలోనే వసూలు చేసుకుంది. ఇలా ఫుల్ రన్‌లో ఈ చిత్రం టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు లాభాలనూ దక్కించుకుంది.
పక్కా పల్లెటూరి స్టోరీతో రూపొంది 'ఆయ్' సినిమా ప్రచార చిత్రాలతో పాటు ప్రమోషన్ పరంగా ఆకట్టుకుంది. దీంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను మంచి పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు టాలీవుడ్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది.
నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' సినిమాను థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతనే స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. గత అర్ధరాత్రి నుంచే ఇది స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ చిత్రం కోసం వీక్షకులు ఎగబడుతున్నారు. ఫలితంగా దీనికి భారీ రెస్పాన్స్ లభిస్తోంది.

ఇదిలా ఉండగా.. పూర్తి స్థాయి కామెడీ కథతో రూపొందిన 'ఆయ్' సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను చేశారు. ఈ మూవీకి రామ్ మిరియాల మ్యూజిక్ కంపోజ్ చేశాడు.


Click it and Unblock the Notifications











