HBD Nataraj Master పుట్టిన రోజున బిగ్‌బాస్‌ను కోరిన కోరిక ఏమిటంటే.. ఫైర్‌బ్రాండ్ ఇమేజ్‌తో నటరాజ్ మాస్టర్
టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా సుపరిచితులైన తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిరమైన సంపాదించుకొన్నాడు. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో సీజన్ 5లో పాల్గొన్న తర్వాత నటరాజ్ మాస్టర్‌లోని విభిన్నమైన కోణం బయటకు వచ్చింది. డ్యాన్స్, రియాలిటీ షోలో సాఫ్ట్‌గా కనిపించే మాస్టర్.. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ప్రేక్షకులకు కొత్త అవతారం చూపించాడు. తాజాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో తనదైన మార్కు చూపిస్తున్న నటరాజ్ మాస్టర్ ఏప్రిల్ 16వ తేదీన పుట్టిన రోజున తోటి కంటెస్టెంట్లతో జరుపుకొంటున్నారు. అయితే ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ బిగ్‌బాస్‌ను ఏం కోరుకొన్నారు? నటరాజ్ మాస్టర్ గురించి మరింత వివరంగా..

ప్రభుదేవా అన్నం పెడుతున్నారంటూ
చిన్నతనంలో డ్యాన్స్‌పై మమకారం పెంచుకొన్న నటరాజ్ మాస్టర్ తన జీవితంలో అనుభవించిన కొన్ని విషయాలను బిగ్‌బాస్ వేదికగా పంచుకొన్నారు. ప్రభుదేవాను అమితంగా ఆరాధించే నటరాజ్ ఆయనకు భక్తుడిగా మారారు. అయితే ప్రభుదేవా నీకు తిండిపెడుతాడా అంటూ తండ్రి కోపగించుకొన్నా తన పట్టుదలను వదలకుండా స్టార్ కోరియోగ్రాఫర్ అయ్యాడు. అదే విషయాన్ని నాన్ స్టాప్‌లో చెబుతూ.. ప్రభుదేవా నాకు, నాకు కుటుంబానికి అన్నం పెడుతున్నాడు. ఈ షోలోకి వచ్చి మీకు వంట చేసే అవకాశాన్ని ప్రభుదేవా కల్పించాడు అంటూ నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు.

అగ్రహీరోలకు కొరియోగ్రాఫర్‌గా
కోరియోగ్రాఫర్‌గా బాలకృష్ణ, ఇతర అగ్ర హీరోల పాటలకు డ్యాన్స్ సమకూర్చాడు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్స్‌లో డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జీగా వ్యవహరించారు. విలక్షణ, విభిన్నమైన తీరుతో కనిపించే నటరాజ్ మాస్టర్‌కు అభిమానులు, భార్య నీతూ మాస్టర్, కుటుంబ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం డిస్నీ+హాట్ స్టార్‌లో బిగ్‌బాస్ టైటిల్ కోసం ఒంటరిపోరాటం చేస్తున్న నటరాజ్ మాస్టర్ ఇతర కంటెస్టెంట్లకు ధీటైన సవాల్ విసురుతున్నాడు.

ముక్కుసూటి మనస్తత్వంతో
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షోలో కఠినమైన టాస్కుల్లో తన శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నాడు. ఇంటి సభ్యులతో ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల చోటుచేసుకొనే గొడవల్లో ధీటుగా కంటెస్టెంట్లను ఎదుర్కొంటున్నాడు. అయితే గత రెండు రోజులుగా తనకు కంట్లో నలుసుగా మారిన యాంకర్ శివను మచ్చిక చేసుకొన్నట్టు కనిపిస్తున్నాడు. తన ఆట తీరును పరిస్థితులకు అనుకూలంగా మలుచుకొంటూ ముందుకు సాగుతున్నాడు. ఇంటిలోనే కాకుండా బయట జరుగుతున్న కుట్రలకు తనదైన శైలిలో సమాధానం చెబుతున్నాడు.

బిగ్‌బాస్‌కు అలాంటి రిక్వెస్ట్
ఇక తన పుట్టిన రోజున నటరాజ్ మాస్టర్ చాలా ప్రశాంతంగా కనిపించాడు. బిగ్‌బాస్ ఇంటిలో కెమెరాలో మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన మటన్ బిర్యానిని పంపించమని కోరుకొన్నాడు. బిగ్‌బాస్ తనకు మటన్ బిర్యాని పంపిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాడు. పుట్టిన రోజు నటరాజ్ మాస్టర్ తన కోరికను తీర్చుకొంటాడా లేదా చూడాల్సిందే.

నటరాజ్ మాస్టర్‌కు ఎలిమినేషన్ ముప్పు
ప్రస్తుతం వారం కోసం జరిగే ఎలిమినేషన్‌లో నటరాజ్ మాస్టర్ నామినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నాడు. అయితే అభిమానుల, ప్రేక్షకుల నుంచి భారీగా మద్దతు ఉన్న మాస్టర్ ఈజీగానే బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నటరాజ్ మాస్టర్ లాంటి ఫైర్ బ్రాండ్ ఇంటిలో ఉంటే కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఆదివారం జరిగే ఎలిమినేషన్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











