Natraj Master : నన్ను కొట్టాలని బిందు టీం ప్లాన్.. ఫ్యామిలీని కూడా వదలలేదు.. ప్రూఫ్ లు కూడా ఉన్నాయి!
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఎట్టకేలకు ముగిసింది. కానీ ఆ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ల మధ్య మాటల యుద్ధం మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మిగతా అందరి సంగతి అలా ఉంచితే బిందుమాధవి విషయంలో నటరాజ్ మాస్టర్ మాత్రం చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో నుండి బయటికి వచ్చిన తర్వాత ఆమె మీద అనేక సంచలన ఆరోపణలు కూడా చేశారు నటరాజ్ మాస్టర్. ఇక తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బిందుమాధవి టీం మీద సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

విరుద్ధంగా ఉందని
పిఆర్ టీమ్ గురించి నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ ఉండడంతో సాధారణంగా పీఆర్ టీం అనేది సోషల్ మీడియా అకౌంట్ మేనేజ్ చేయడం కోసమే కదా అని ప్రశ్నించగా నీతిగా నిజాయితీగా ఆడితే అలా చేయడం కరెక్ట్ ఏ అని ఆయన చెప్పుకొచ్చారు. మామూలుగా ఆడే వాళ్ళ గేమ్ ని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లి ఓట్లు వేయించడం కోసం పీఆర్ టీం పని చేయాలి కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.

ఆ అవసరం ఏమొచ్చింది
గేమ్ ఆడకపోయినా ఆడినట్లు భ్రమ కల్పిస్తూ దొంగ ఓట్లు వేయిస్తూ ఆమె మీద ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే కుటుంబాలతో సహా అందరినీ అసభ్యకరమైన మాటలతో హింసించారని అన్నారు. కుటుంబాలను తిట్టడం కరెక్ట్ కాదని పేర్కొన్న ఆయన తన కుటుంబాన్ని, అఖిల్ కుటుంబాన్ని, మిత్రా కుటుంబాన్ని కూడా వదల లేదని ఆయన అన్నారు. ఏదైనా ఉంటే మేము మేము చూసుకుంటాం కదా ఇందులో కుటుంబాలను లాగాల్సిన అవసరం ఏమొచ్చింది అని నటరాజ్ మాస్టర్ ప్రశ్నించారు.

కొడదామని
ఆడపులి అనే మాట ముందే ఫిక్స్ అయి తరువాత లోపలికి వచ్చారని అలా ఎనిమిదో వారానికి ప్రేక్షకులందరికీ మెదడులో ఆడపులి అనే పదాన్ని రిజిస్టర్ చేయడంలో సక్సెస్ సాధించారని అన్నారు. అంతేకాక వాళ్ళ టీం సభ్యులు కలిసి మాట్లాడుకున్న స్క్రీన్షాట్స్ తన దగ్గర ఉన్నాయని కావాలంటే ఇంటర్వ్యూ అయ్యాక చూపిస్తా అని అన్నారు. ఎలిమినేషన్ పూర్తయిన తర్వాత బయటకు వస్తే తనను కొడదామని అనుకున్నారని ఆయన ఆరోపించారు.

బట్టబయలు చేసేలా
తన మీద ఎటాక్ చేయాలని రాళ్లతో కొట్టాలని అనుకుంటున్నారని ఆయన ఆరోపించడంతో అసలు కొట్టే దాకా ఎందుకు వచ్చింది అని యాంకర్ ప్రశ్నించింది. వాళ్ళు కష్టపడి డబ్బులు తీసుకుని ఆమెను ప్రమోట్ చేస్తున్నారు అంటే అర్థం ఉంది వాళ్ళ మీమీద పగ బట్టి మేము ఎందుకు దాడి చేయాలనుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు అంత కష్టపడి ఆమె ఏమీ చేయకపోయినా ఆమెకు ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి అనుకున్నారు కానీ నేను అదంతా బట్టబయలు చేసేలా మాట్లాడుతున్నాను దీంతో వాళ్లు నా మీద పగ బట్టి ఉండవచ్చు అని పేర్కొన్నాడు.

రెండు ప్లాన్స్ చేసుకోలేదు
అంతేకాక తమిళ బిగ్ బాస్ కి వెళ్ళిన ఆమె అక్కడ హోస్ట్ కమల్ హాసన్ గారు తెలుగులో మాట్లాడినా సరే సమాధానం అని చెప్పుకొచ్చారు. ఆమెలా తాము ఇక్కడ వర్కవుట్ కాకపోతే అక్కడ, అక్కడ వర్కవుట్ కాకపోతే ఇక్కడ అంటూ రెండు ప్లాన్స్ చేసుకోలేదని, నటరాజ్ మాస్టర్ చెప్పుకొచ్చారు. అంతేగాక సిగరెట్ కూడా తాగి గుడ్డు పగలగొట్టి వాసన రాకుండా మేనేజ్ చేసేదని నటరాజ్ మాస్టర్ ఆరోపించారు.


Click it and Unblock the Notifications











