OTT: ఓటీటీలో దుమ్మురేపుతోన్న సరిపోదా శనివారం.. ఇండియా వైడ్ నాని రేర్ రికార్డ్!
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహనన్, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషించిన చిత్రం సరిపోదా శనివారం. ఆగస్ట్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా నాని ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఇచ్చింది. ఇటీవల ఓటీటీలో రిలీజైన సరిపోదా శనివారం ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలో ఓ రేర్ ఫీట్‌ని అందుకుంది. ఈ వివరాల్లోకి వెళితే :
సరిపోదా శనివారం చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య దాదాపు రూ.100 కోట్ల రూపాయలతో నిర్మించారు. దసరా, హాయ్ నాన్న వంటి సినిమాల తర్వాత నాని నటించిన మూవీ కావడంతో సరిపోదా శనివారానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలకు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల హక్కులు 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 5 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తంగా నాని సినిమా రూ.41 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ పండితులు తెలిపారు. ఒకరకంగా ఇది నేచురల్ స్టార్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ అని చెప్పవచ్చు.

సరిపోదా శనివారం మూవీని దాదాపు 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. రూ. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ అన్నిచోట్ల పాజిటివ్ టాక్‌తో భారీ ఒపెనింగ్స్ సాధించింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో నాని కుమ్మిపడేశాడు. అన్ని రకాల ప్రతికూలతలను ఎదుర్కొని రికార్డు వసూళ్లు సాధించిన నాని థియేటర్‌లో క్లోజింగ్ బిజినెస్ పూర్తయ్యే నాటికి రూ.100 కోట్ల గ్రాస్, రూ.52 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మొత్తంగా రూ.7 కోట్ల లాభాన్ని సరిపోదా శనివారం అందించింది. థియేట్రికల్, డిజిటల్, ఆడియో ఇలా అన్ని రకాలుగా నిర్మాత సేఫ్ అయ్యాడని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంతేకాదు 100 కోట్ల గ్రాస్, 50 కోట్ల షేర్ అందుకున్న నాని మూడో చిత్రంగా నిలిచింది.
థియేటర్‌లో రన్నింగ్ ముగియడంతో సెప్టెంబర్ 26న సరిపోదా శనివారం ఓటీటీలో అడుగుపెట్టింది. నెట్‌ఫ్లెక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‌కు వచ్చేలా ఓటీటీ సంస్థతో మేకర్స్ ముందే ఒప్పందం చేసుకున్నారు. అయితే సరిపోదా శనివారం బ్లాక్‌బస్టర్ అయినా నెల తిరగకుండానే ఓటీటీలోకి రావడం గమనార్హం. థియేటర్‌లో మాదిరిగానే ఓటీటీలోనూ ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది.

♥️#SaripodhaaSanivaaram @netflix pic.twitter.com/hRmaqULHpI
— Nani (@NameisNani) September 29, 2024
స్ట్రీమింగ్‌లోకి వచ్చిన రెండో రోజు నుంచి సరిపోదా శనివారం దేశవ్యాప్తంగా టాప్ వన్ పొజిషన్‌లో ఉందట. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన ఉలఝ్ కూడా టాప్ ప్లేస్ కోసం గట్టి పోటీనిస్తోంది. సెప్టెంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ఈ సినిమా మంచి వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మరి సరిపోదా శనివారం తన నెంబర్ వన్ ప్లేస్‌ను ఎన్ని రోజులు కాపాడుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











