హీరో నవదీప్ పెద్ద ‘గే’.. ఆ స్టార్ హీరో ‘ఆటగాడు’: సంచలనంగా జబర్ధస్త్ బ్యూటీ వీడియో

తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నారు. అయితే, మరికొందరు మాత్రం పలు కారణాలు, వివాదాల వల్ల సినిమాల్లో నటించకున్నా బాగా హైలైట్ అవుతున్నారు.

అలాంటి వారిలో యంగ్ హీరో నవదీప్ ఒకడు. సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో కాంట్రవర్శీలతోనే సెన్సేషన్ అయిన అతడు.. తాజాగా 'దావత్' అనే షోలో పాల్గొన్నాడు. ఇందులో హోస్ట్ రీతూ చౌదరితో కలిసి అతడు రచ్చ రచ్చ చేసేశాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

Navdeep and Rithu Chowdary Shocking Comments in Daawath Show

దావత్ అనే షోతో రీతూ: జబర్ధస్త్ ద్వారా ఫుల్ ఫేమస్ అయిన బ్యూటీల్లో రీతూ చౌదరి ఒకరు. చాలా కాలంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న ఈ భామ.. ఇప్పుడు 'దావత్' అనే టాక్ షోను హోస్ట్ చేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ నిర్మిస్తోన్న ఈ షోలోకి సినిమా సెలెబ్రిటీలు వచ్చి రచ్చ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఇది ఎన్నో ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. వీటికి భారీ స్థాయిలో స్పందన కూడా వచ్చింది.

Navdeep and Rithu Chowdary Shocking Comments in Daawath Show

నవదీప్‌ రాకతో రచ్చగా: రీతూ చౌదరి హోస్ట్ చేస్తున్న 'దావత్' షోలో భాగంగా కొత్త ఎపిసోడ్‌ కోసం హీరో నవదీప్ గెస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ప్రోమో తాజాగా విడుదలైంది. అతడు రావడం రావడమే యాంకరమ్మ ఓ కవితతో వెల్‌కం చెప్పింది. అందుకు తగ్గట్లుగానే నవదీప్ తనదైన పంచ్ వేసి షాకిచ్చాడు. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతూ షోను రంజుగా మార్చారు.

Navdeep and Rithu Chowdary Shocking Comments in Daawath Show

సూటిగా ప్రశ్నలు వేస్తూ: 'దావత్' షోలో భాగంగా యాంకర్ రీతూ చౌదరి.. నవదీప్‌ను అదిరిపోయే సూటి ప్రశ్నలు అడిగింది. అదే సమయంలో కొందరు ఆడియెన్స్ కూడా అతడిని ఇరికించే ప్రశ్నలతో సతమతం అయ్యేలా చేశారు. కానీ, నవదీప్ మాత్రం ఎక్కడా కంట్రోల్ తప్పకుండా సమాధానాలు చెప్పాడు. ముఖ్యంగా అద్దం ముందు చేసే పని, న్యూస్ చానెళ్లపై అక్కసును అతడు బయటపెట్టాడు.

Navdeep and Rithu Chowdary Shocking Comments in Daawath Show

నవదీప్‌ను గే అంటూ: ఎంతో క్రేజీగా సాగుతోన్న 'దావత్' షోలో భాగంగా యాంకర్ రీతూ చౌదరి 'మీరు గే అని ఒక టైంలో రూమర్ బాగా ప్రచారం అయింది. అంటే అన్నాడు కానీ, ఆ ఊహ ఎంత బాగుందో' అని అనేసింది. దీంతో నవదీప్ ఎంతగానో నవ్వుకున్నాడు. ఆ తర్వాత రీతూ చౌదరి 'మీరు సింగిలా? గ్రూపా' అంటూ మళ్లీ గే అనేలా ప్రశ్నించింది. దీనికి కూడా అతడు పెద్దగా నవ్వేశాడు.

రానా పెద్ద ఆటగాడు: 'దావత్' షోలో ఓ అబ్బాయి 'ఆటగాళ్లు అని ఈ మీమ్ మీకెప్పుడు కనెక్ట్ అయింది' అని ప్రశ్నించాడు. దీనికి నవదీప్ 'ఇంకెవరు మా రానా బాబే' అన్నాడు. ఆ తర్వాత 'మా బావ పెద్ద పోరంబోకు అంటున్న నవదీప్' అని కామెంట్ చేశాడు. వీటితో పాటు 'ఈగల్' మూవీ ముచ్చట్లు కూడా ఈ షోలో చెప్పాడు. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X