ఒకేసారి రెండు ఓటీటీల్లో బోల్డు మూవీ.. ఇంట్లో వాళ్లతో కలిసి చూశారంటే అంతే!
మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈ మధ్య కాలంలో డిఫరెంట్ జోనర్లలో సినిమాలు వస్తున్నాయి. అయితే, వాటిలో అన్నింటి కంటే ఎక్కువగా బోల్డు కంటెంట్ మూవీలు రూపొందుతోన్నాయి. ఓటీటీల వాడకం కూడా పెరగడంతో ఈ తరహా సినిమాలు మరింతగా తెరకెక్కుతోన్నాయి. ఇలా ఇటీవలే వచ్చిన క్రేజీ మూవీనే 'లవ్ మౌళి' (Love Mouli).
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవదీప్ ప్రధాన పాత్రలో నటించిన బోల్డ్ కంటెంట్ మూవీనే 'లవ్ మౌళి'. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు అవనీంద్ర తెరకెక్కించిన ఈ సినిమా యూత్‌ను టార్గెట్ చేసేలా మితిమీరిన బోల్డ్ కాన్సెప్టుతో రూపొందింది. దీంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని జూన్ 7న రిలీజ్ చేశారు.

యువతను ఆకట్టుకునే అడల్డ్ కంటెంట్‌తో రూపొందిన 'లవ్ మౌళి' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. యూత్ దీనికి ఫిదా అయినా ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం ముఖం చాటేశారు. ఫలితంగా ఈ చిత్రం ఓవరాల్‌గా ఆశించిన రీతిలో ఆడియెన్స్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకోలేకపోయింది. ఫలితంగా చాలా గ్యాప్ తర్వాత హిట్ కోసం వచ్చిన నవదీప్‌కు నిరాశనే మిగిల్చింది.
బిగ్ హిట్ కోసం ప్రయోగాత్మక కథతో నవదీప్ నటించిన 'లవ్ మౌళి' సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉండడంతో.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం తీవ్ర పోటీ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు కొనుగోలు చేశాయి. ఇందుకోసం రెండు ఓటీటీలో భారీ మొత్తాన్నే నిర్మాతలకు అప్పజెప్పాయని తెలిసింది.

నవదీప్ నటించిన 'లవ్ మౌళి' సినిమా స్ట్రీమింగ్ గురించి కూడా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. దీన్ని థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేస్తారని తాజాగా తెలిసింది. అంటే జూన్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమా జూలై రెండో వారంలోనే స్ట్రీమింగ్‌కు వస్తున్నట్లు తెలిసింది. ఈ డేట్‌ను ఆహా, అమెజాన్ త్వరలోనే రివీల్ చేయనున్నాయి.
ఇదిలా ఉండగా.. నవదీప్ - అవనీంద్ర కాంబినేషన్‌లో రూపొందిన 'లవ్ మౌళి' సినిమాను నైరా క్రియేషన్స్, సీ స్పేస్ బ్యానర్లపై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మించారు. పంఖురి గిద్వానీ, చార్వీ దత్తా, భావనా సాగి హీరోయిన్స్‌గా చేశారు. అలాగే రానా దగ్గుబాటి అఘోరా పాత్రలో కెమియో రోల్‌లో మెరిశాడు. దీనికి గోవింద్ వశిష్ట సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











