ఓటీటీలోకి బెస్ట్ రొమాంటిక్ మూవీ.. ఒంటరిగా చూడాల్సిన ఇది ఎప్పుడు వస్తుందంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న హీరోలు ఎంతో మంది ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తుండగా.. మరికొందరు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో నవదీప్ ఒకడు. చాలా కాలం క్రితమే హీరోగా వచ్చిన అతడు.. హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. కానీ, ఈ మధ్య కాలంలో హీరోగా సినిమాలు చేయడం ఆపేశాడు. ఈ పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత నవదీప్ 'లవ్ మౌళి' (Love Mouli) అనే మూవీ చేశాడు. తాజాగా వచ్చిన ఈ మూవీ ఓటీటీ వివరాలు మీకోసమే!

టాలీవుడ్ క్రేజీ హీరో నవదీప్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ సినిమానే 'లవ్ మౌళి'. లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి దగ్గర పని చేసిన అవనీంద్ర తెరకెక్కించిన ఈ సినిమా యూత్‌ను టార్గెట్ చేసేలా మితిమీరిన బోల్డ్ కంటెంట్‌తో రూపొందింది. ఈ మూవీ ప్రచార చిత్రాలకు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో దీన్ని జూన్ 7న ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Navdeep Starrer Love Mouli Movie Streaming On AHA From June 27th

బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన 'లవ్ మౌళి' సినిమాకు అనుకున్న విధంగా మంచి టాక్ అయితే రాలేదు. కానీ, యూత్‌కు మాత్రం ఇది బాగానే నచ్చింది. ఫలితంగా ఈ చిత్రం ఓవరాల్‌గా ఆశించిన రీతిలో ప్రేక్షకుల స్పందనను సొంతం చేసుకోలేకపోయింది. ఫలితంగా చాలా గ్యాప్ తర్వాత హిట్ కోసం డిఫరెంట్ ప్రయోగం చేసిన నవదీప్‌కు బిగ్ షాక్ తగిలినట్లు అయింది.

డిఫరెంట్ కంటెంట్‌తో రూపొందిన నవదీప్ నటించిన 'లవ్ మౌళి' సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉండడంతో.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఎవరు తీసుకుంటారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు కొనుగోలు చేసినట్లు టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆహా దీనిపై ప్రకటన చేసింది.

Navdeep Starrer Love Mouli Movie Streaming On AHA From June 27th

నవదీప్ నటించిన 'లవ్ మౌళి' సినిమా స్ట్రీమింగ్ డేట్ గురించి ఎన్నో ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆహా సంస్థ ఈ సినిమాను జూన్ 27 నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో బోల్డ్ కంటెంట్‌ను ఇష్టపడే వాళ్లంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. థియేటర్లలో మెప్పించని ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

ఇదిలా ఉండగా.. నవదీప్ - అవనీంద్ర కాంబినేషన్‌లో రూపొందిన 'లవ్ మౌళి' సినిమాను నైరా క్రియేషన్స్, సీ స్పేస్ బ్యానర్లపై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మించారు. పంఖురి గిద్వానీ, చార్వీ దత్తా, భావనా సాగి హీరోయిన్స్‌గా చేశారు. అలాగే రానా దగ్గుబాటి అఘోరా పాత్రలో కెమియో రోల్‌లో మెరిశాడు. దీనికి గోవింద్ వశిష్ట మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X