ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ మూవీ.. ఫ్యామిలీతో కలిసి చూశారో అంతే!
ఒకప్పుడు బాలీవుడ్‌తో పాటు వేరే భాషల్లోనే బోల్డ్ కంటెంట్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. వీటికి అన్ని వర్గాల నుంచి స్పందన రాకున్నా.. ఫిల్మ్ మేకర్లు మాత్రం ఈ తరహా చిత్రాలను ఎక్కువగా చేస్తున్నారు. ఇలా ఇటీవలి కాలంలో వచ్చిన క్రేజీ బోల్డ్ సినిమానే 'లవ్ మౌళి' (Love Mouli). టాలెంటెడ్ హీరో నవదీప్ నటించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!
చాలా గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా నటించిన సినిమానే 'లవ్ మౌళి'. దర్శకధీరుడు రాజమౌళి దగ్గర పని చేసిన అవనీంద్ర తెరకెక్కించిన ఈ రొమాంటిక్ సినిమా యూత్‌ను టార్గెట్ చేసేలా అదిరిపోయే బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రచార చిత్రాలకు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో దీన్ని జూన్ 7న ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'లవ్ మౌళి' మూవీకి అనుకున్న విధంగా మంచి టాక్ అయితే రాలేదు. కానీ, యూత్‌కు మాత్రం ఇది కనెక్ట్ అయింది. ఫలితంగా ఈ చిత్రం ఓవరాల్‌గా ఆశించిన రీతిలో ప్రేక్షకుల స్పందనను అందుకోలేకపోయింది. ఫలితంగా చాలా గ్యాప్ తర్వాత హిట్ కోసం డిఫరెంట్ ప్రయోగం చేసిన నవదీప్‌కు మరోసారి నిరాశే మిగిలిపోయిందని చెప్పాలి.
బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన నవదీప్ నటించిన 'లవ్ మౌళి' సినిమాపై అంచనాలు భారీగానే ఉండడంతో.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఎవరు తీసుకుంటారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు కొనుగోలు చేశాయని అన్నారు. కానీ, ఒక ఓటీటీలో వీటిని ఇచ్చినట్లు తర్వాత క్లారిటీ వచ్చింది.

నవదీప్ నటించిన 'లవ్ మౌళి' సినిమా స్ట్రీమింగ్ గురించి ఎన్నో ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆహా సంస్థ ఈ సినిమాను జూన్ 27 నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. అందుకు అనుగుణంగానే అన్ని సినిమాల్లా కాకుండా దీన్ని 27వ తేదీ రాత్రి స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చారు. ఇక, ఆహాలో ఈ చిత్రం అదరగొడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. టాలీవుడ్ క్రేజీ హీరో నవదీప్ - అవనీంద్ర కాంబినేషన్‌లో రూపొందిన 'లవ్ మౌళి' సినిమాను నైరా క్రియేషన్స్, సీ స్పేస్ బ్యానర్లపై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మించారు. పంఖురి గిద్వానీ, చార్వీ దత్తా, భావనా సాగి హీరోయిన్స్‌గా చేశారు. అలాగే రానా దగ్గుబాటి అఘోరా పాత్రలో కెమియో రోల్‌లో మెరిశాడు. దీనికి గోవింద్ వశిష్ట మ్యూజిక్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











