OTTలోకి డైరెక్టుగా వచ్చేసిన క్రైమ్ హారర్ థ్రిల్లర్.. చూడాలంటే డేర్ ఉండాల్సిందే!
ఓటీటీలోకి అతి భయంకరమైన మిస్టరీ, క్రైమ్, హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ అన్నీ కలగలపిని ఓ వెబ్ సిరీస్ వచ్చేసింది. ఈ మధ్య కాలంలో మిస్టరీ, క్రైమ్ హారర్ థ్రిల్లర్ జోనర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ క్రమంలోనే మేకర్స్ మంచి కథలతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త కంటెంట్.. ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయిపోయింది. ప్రముఖ ఓటీటీలో ఈ క్రైమ్ హారర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతుంది. అసలు ఆ సీరిస్ ఏంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.
నవీన్ చంద్ర హీరోగా...
హీరో నవీన్ చంద్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరిస్తూ వస్తున్నాడు. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నవీన్ చంద్ర.. ఆ తర్వాత పలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేశాడు. గతేడాది కలర్స్ స్వాతితో కలిసి చేసిన మంత్ ఆఫ్ మధు సినిమా చేశాడు. ఇక ఈ సినిమా పర్వాలేదనిపించుంది. ఇక ఇటీవల వెబ్ సిరీసులు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.

ఇన్స్ పెక్టర్ రిషిగా...
జగపతి బాబుతో కలిసి చేసిన పరంపర సిరీస్ నవీన్ చంద్రకు మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ రెండు సీజన్స్ పరంపర నవీన్ చంద్ర కెరీర్‌లో మంచి సిరీస్ గా నిలువగా... ఇప్పుడు మరో కొత్త సిరీసుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సాధారణంగా హారర్ థ్రిల్లర్స్ కు ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపుతుంటారు. అలాంటింది హారర్ థ్రిల్లర్ జోనర్ కు క్రైమ్ యాడ్ చేసి ఫుల్ సస్పెన్స్ జత చేసి ఇప్పుడు ఇన్ స్పెక్టర్ రిషిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఓటీటీలోకి డైరెక్టుగా...
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఇన్ స్పెక్టర్ రిషి సిరీస్ మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది. దాదాపుగా 35 నుంచి 60 నిమిషాల నిడివితో 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ ఆకట్టుకుంది. మనుషులకు గూడు పెట్టే ఓ రాకాసి దెయ్యం కథగా ఈ సిరీస్ తెకకెక్కింది. ఇక ఈ సీరిసుకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి రెస్పాన్స్ వస్తుంది.
సిరీస్ విషయానికి వస్తే...
ఇక ఈ సిరీసులో నవీన్ చంద్రతోపాటు సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సీరిసుకు నందిని జె.ఎస్ దర్శకత్వం వహించారు. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్‌పై సుఖ్ దేవ్ లాహిరి నిర్ంచగా.... ఇది అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీసుగా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇక ఈ సిరీసు క్రైమ్, హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ గా తెరక్కింది. దీనికి చట్టాలు అతీంద్రియ శక్తులను బంధించలేవు అని క్యాప్షన్ పెట్టారు. ఇక ఈ సిరీసు ఈ వీకెండ్ మీరు ఇంట్లో చూసి ఎంజాయ్ చేసేందుకు మంచి ఆప్షన్ కానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











