ఓటీటీలో కుమ్మేస్తోన్న నవీన్ చంద్ర ఫ్లాప్ మూవీలు.. స్టార్లని వెనక్కినెట్టి టాప్ ట్రెండింగ్‌లోకి!

అదెంటో కానీ టాలెంట్ ఉన్న నటులకు సినీ పరిశ్రమలో అవకాశాలు రావు. ఏమాత్రం ప్రతిభ లేనివారికి అవకాశాలు, స్టార్‌డమ్ వచ్చేస్తుంది. ఈ మొదటి కోవలోకే వస్తారు నవీన్ చంద్ర. 2012లో విడుదలైన అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆయన తన హ్యాండ్సమ్ లుక్‌తో ఆకట్టుకున్నారు. తర్వాత సెకండ్ హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ తీసుకుని రాణిస్తున్నాడు. అయితే నవీన్ చంద్ర కెరీర్‌లో హిట్ అయిన సినిమాలను వేళ్లపై లెక్క పెట్టొచ్చు. కానీ చేతినిండా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు ఈ హీరో.

ఏ పాత్రకైనా సై
ఓటీటీల రాకతో నవీన్ చంద్ర లాంటి వారికి గిరాకీ పెరిగింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కే ఆయన సినిమాలు థియేటర్‌లలో హిట్ అయినా కాకున్నా ఓటీటీలో మినిమమ్ గ్యారెంటీగా ఆడుతూ మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. దాంతో నవీన్ చంద్ర సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా ఆడినా మంచి లాభాలు వస్తాయని నిర్మాతలకు ఓ నమ్మకం ఏర్పడింది. అన్నింటికి మించి హీరో పాత్రలతోనూ గిరి గీసుకుని కూర్చోకుండా ఏ రోల్‌కైనా నవీన్ చంద్ర సిద్ధంగా ఉండటం ఆయనకు బాగా కలిసిస్తోంది.

Naveen Chandra starrer Eleven and Blind Spot movie s Trending top in Amazon Prime Video

వరుస సినిమాలతో బిజీ
ఈ ఏడాది ఇప్పటికే గేమ్ ఛేంజర్‌లో నెగిటివ్ రోల్ పోషించిన నవీన్ చంద్ర ఆ తర్వాత లెవన్, 28 డిగ్రీస్ సెల్సియస్ చిత్రాల్లో నటించారు. క్రైమ్ ఎలిమెంట్స్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలు ఓటీటీలో బాగానే వర్కవుట్ అయ్యాయి. అలాగే ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన మాస్ జాతర సినిమాలో నటిస్తున్నారు. అలాగే కాళీ అనే మరో చిత్రం చేస్తున్నాడు. హరి ఏలేటీ అనే దర్శకుడితో కలిసి నవీన్ చంద్ర కామెడీ జోనర్‌లో నటించగా అది విడుదలకు సిద్ధమైంది.

ఒకేరోజున ఓటీటీలోకి రెండు సినిమాలు
ఇప్పటికే నవీన్ చంద్ర హీరోగా నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవన్ జూన్ 13 నుంచి ఆహా ఓటీటీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. లోకేశ్ అజిల్ తెరకెక్కించిన ఈ సినిమాలో రియా హరి, శశాంక్, అభిరామి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అదే రోజున ఓటీటీలోకి వచ్చిన మరో నవీన్ చంద్ర చిత్రం బ్లైండ్ స్పాట్.. ఇప్పుడు ఓటీటీలో ఈ రెండు చిత్రాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

టాప్ 1, టాప్ 2 నవీన్ చంద్ర సినిమాలే
లెవన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఇండియాలో నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని హీరో నవీన్ చంద్ర స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. తనను ఆశీర్వదించి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక నవీన్ చంద్ర నటించిన మరో చిత్రం బ్లైండ్ స్పాట్ కూడా ఓటీటీలో దుమ్ముదులుపుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఇండియా వ్యాప్తంగా టాప్ 2లో ట్రెండో అవుతోంది. ఈ విషయాన్ని ఈ సినిమాలో నటించిన ప్రముఖ యాంకర్ గాయత్రి భార్గవి తన సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. బ్లైండ్‌ స్పాట్‌లో అలీ రెజా, రవివర్మ ఇతర కీలకపాత్రలు పోషించారు. మొత్తానికి అమెజాన్ ప్రైమ్‌ ఇండియాలో మొదటి రెండు స్థానాల్లో నవీన్ చంద్ర సినిమాలే ఉండటం విశేషం. ఈ దెబ్బతో ఆయనకు ఓటీటీ నుంచి మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X